Telugu Global
National

గీతం ఆక్రమణల కూల్చివేతపై హైకోర్టు స్టే

గీతం యూనివర్శిటీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. సోమవారం ఉదయం వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. శనివారం రాత్రి గీతం యాజమాన్యం అత్యవసరంగా హైకోర్టు న్యాయమూర్తి ముందు హౌజ్ మోషన్‌ను దాఖలు చేసింది. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని పిటిషన్‌ వేసింది. ఈ మేరకు శనివారం రాత్రి అత్యవసరంగా హౌస్ మోషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయమూర్తి సోమవారం ఉదయం వరకు కూల్చివేతలు చేపట్టవద్దని […]

గీతం ఆక్రమణల కూల్చివేతపై హైకోర్టు స్టే
X

గీతం యూనివర్శిటీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. సోమవారం ఉదయం వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది.

శనివారం రాత్రి గీతం యాజమాన్యం అత్యవసరంగా హైకోర్టు న్యాయమూర్తి ముందు హౌజ్ మోషన్‌ను దాఖలు చేసింది. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని పిటిషన్‌ వేసింది. ఈ మేరకు శనివారం రాత్రి అత్యవసరంగా హౌస్ మోషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయమూర్తి సోమవారం ఉదయం వరకు కూల్చివేతలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

మొత్తం 40.51 ఎకరాలను గీతం వర్శిటీ ఆక్రమించగా… శనివారం 38. 53 ఎకరాల భూమిని ప్రభుత్వ యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. ఆ భూమి ప్రభుత్వానిది అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. మరికొంత భూమిలో శాశ్వత కట్టడాలను గీతం నిర్మించి ఉండడంతో వాటికి మార్కింగ్ చేశారు. దాంతో గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. ఐదు నెలల క్రితమే గీతంకు నోటీసులు ఇచ్చినట్టు కూడా అధికారులు ప్రకటించారు.

First Published:  24 Oct 2020 9:30 PM GMT
Next Story