Telugu Global
National

ఒకేసారి జన్మించిన ఐదుగురిలో... ముగ్గురికి ఒకే రోజు పెళ్లిళ్లు !

నవంబరు 18, 1995న కేరళలోని తిరువనంతపురం జిల్లా, నన్నతుకవుకి చెందిన రెమాదేవి అనే మహిళ ఒకే కానుపులో ఐదుమంది శిశువులకు జన్మనిచ్చింది. నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. కేరళలో అప్పట్లో ఆ విషయాన్ని జనం విచిత్రంగా చెప్పుకున్నారు. అప్పుడే కాదు… ఆ ఐదుగురు పిల్లలు పెరిగి పెద్దవుతున్న క్రమంలో కూడా మీడియాలో అనేక సందర్భాల్లో కనబడుతూనే ఉన్నారు. కేరళ కేలండర్ ప్రకారం వారు జన్మించింది… ఉత్రమ్ నక్షత్రం కావటంతో తల్లిదండ్రులు దేవి, ప్రేమ్ కుమార్ తమ పిల్లలకు  […]

ఒకేసారి జన్మించిన ఐదుగురిలో... ముగ్గురికి ఒకే రోజు పెళ్లిళ్లు !
X

నవంబరు 18, 1995న కేరళలోని తిరువనంతపురం జిల్లా, నన్నతుకవుకి చెందిన రెమాదేవి అనే మహిళ ఒకే కానుపులో ఐదుమంది శిశువులకు జన్మనిచ్చింది. నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. కేరళలో అప్పట్లో ఆ విషయాన్ని జనం విచిత్రంగా చెప్పుకున్నారు. అప్పుడే కాదు… ఆ ఐదుగురు పిల్లలు పెరిగి పెద్దవుతున్న క్రమంలో కూడా మీడియాలో అనేక సందర్భాల్లో కనబడుతూనే ఉన్నారు.

కేరళ కేలండర్ ప్రకారం వారు జన్మించింది… ఉత్రమ్ నక్షత్రం కావటంతో తల్లిదండ్రులు దేవి, ప్రేమ్ కుమార్ తమ పిల్లలకు ఉత్తర, ఉత్తమ, ఉత్రా, ఉత్రజా, ఉత్రాజన్ అని పేర్లు పెట్టారు. మళయాల మీడియా ఈ పిల్లలను పంచరత్నాలుగా పిలుస్తుంది.

ఇప్పుడు పిల్లలందరూ మంచి చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. వారు శనివారం మరొకసారి వార్తల్లోకి ఎక్కారు. ఐదుగురిలో నలుగురు అమ్మాయిలకు ఒకేసారి నిశ్చితార్దాలు కాగా శనివారం ముగ్గురి పెళ్లిళ్లయ్యాయి. ఒకమ్మాయికి కాబోయే వరుడు కువైట్ నుండి రాలేకపోవటం వలన ఆమె వివాహం ఆగిపోయింది. త్రిష్యూర్ జిల్లాలోని గురువాయుర్ గుళ్లో ఈ వివాహాలు జరిగాయి.

దేవి… కృష్ణుని భక్తురాలు కావటంతో గురువాయుర్ గుళ్లో వివాహాలు జరిపించింది. తన పిల్లలను పెంచడంలో కృష్ణుడే తనకు ధైర్యాన్ని, శక్తిని ఇచ్చాడని దేవి అంటారు. ముగ్గురు పిల్లలకు ఒకేసారి వివాహాలు కావటంతో తనకు చాలా సంతోషంగా ఉందని దేవి మీడియాకు తెలిపింది.

ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న ఉత్రా వివాహం.. మస్కట్ లో హోటల్ మేనేజర్ గా ఉన్న అజిత్ కుమార్ తో, మీడియాలో పనిచేస్తున్న ఉత్తర వివాహం.. అదే రంగంలో ఉన్న మహేష్ కుమార్ తో, అనెస్తీషియా టెక్నీషియన్ గా ఉన్న ఉత్తమ పెళ్లి మస్కట్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్న వినీత్ తో జరగగా… అనెస్తీషియా టెక్నీషియన్ గానే ఉన్న ఉత్రజ వివాహం కువైట్ లో ఇదే జాబ్ చేస్తున్న ఆకాష్ తో….జరిగాల్సి ఉండగా అతను రాలేకపోవటంతో వాయిదా పడింది.

పిల్లలను పెంచి పెద్ద చేయటంలో దేవి చాలా కష్టాలు అనుభవించింది. ఆమె భర్త 2005 లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆయన పిల్లలందరికీ బట్టలు, చెప్పులు, బ్యాగులు లాంటివన్నీ ఒకేరకమైనవి ఉండాలని అనుకునేవాడు. చిన్నవ్యాపారి కావటంతో ఖర్చులను భరించే శక్తి ఉండేది కాదు. తరువాత దేవి గుండెకు సంబంధించిన అనారోగ్యానికి గురికావటం, మరింత ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రేమ్ కుమార్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అయితే తరువాత కాలంలో దేవికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొన్ని మీడియా సంస్థలు ఆ కుటుంబానికి సహాయంగా నిలిచాయి. దాంతో దేవి తన పిల్లలందరికీ మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగింది.

First Published:  25 Oct 2020 2:45 AM GMT
Next Story