Telugu Global
National

పోలవరం నెత్తిన బండరాయి వేసిన చంద్రబాబు విజన్

పోలవరం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడితే ఆలస్యం అవుతుందని… నాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ సమయంలో చంద్రబాబు కేంద్రంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అవే ఇప్పుడు పోలవరానికి పెనుసవాల్‌గా మారాయి. తాము కేవలం 2014 నాటి అంచనా వ్యయాన్ని, అందులోనూ నీటిపారుదల విభాగానికి అయ్యే ఖర్చును మాత్రమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేయగా… నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించింది. 2014 ఏప్రిల్‌ […]

పోలవరం నెత్తిన బండరాయి వేసిన చంద్రబాబు విజన్
X

పోలవరం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడితే ఆలస్యం అవుతుందని… నాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ సమయంలో చంద్రబాబు కేంద్రంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అవే ఇప్పుడు పోలవరానికి పెనుసవాల్‌గా మారాయి.

తాము కేవలం 2014 నాటి అంచనా వ్యయాన్ని, అందులోనూ నీటిపారుదల విభాగానికి అయ్యే ఖర్చును మాత్రమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేయగా… నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించింది. 2014 ఏప్రిల్‌ 1నాటి ప్రాజెక్టు అంచనా వ్యయం కేవలం 20వేల 389 కోట్లు మాత్రమే. ప్రాజెక్టు నిర్మాణ పనులు తమ చేతుల్లోకి వస్తే పనులు తమకు నచ్చిన కంపెనీకి ఇచ్చి, కమిషన్లు తీసుకోవచ్చన్న ఆలోచనతో, భూసేకరణ వ్యయం, ఇతర అంశాలను నాడు టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా కేంద్రం షరతులకు తలొగ్గిందని ఆరోపణలున్నాయి. 2016 సెప్టెంబర్‌తో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఒప్పందం చేసుకుంది.

2014 అంచనాల ప్రకారం ఇస్తే ప్రాజెక్టు నిర్మాణం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించాల్సిన చంద్రబాబునాయుడు… 2018లో తిరిగి కేంద్రానికి ఒక లేఖ రాశారు. 2014 ధరల ప్రకారం కేంద్రం చెల్లిస్తామన్న నిధులన్నీ త్వరగా విడుదల చేయాలని కోరారు. ఆ తర్వాత ఆలస్యంగా మేలుకుని ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. చివరకు ప్రాజెక్టు అంచనాల సవరణ కమిటీ పోలవరం నిర్మాణ వ్యయాన్ని 47వేల 725 కోట్లకు ఆమోదించింది. దీన్ని కేంద్ర జలశక్తి శాఖ కూడా ఆమోదించి ఆర్ధిక శాఖకు పంపింది. 47వేల కోట్లకు సవరించిన డీపీఆర్‌ను ఆర్థిక శాఖ ఆమోదించేందుకు నిరాకరించింది.

2016లో నాటి రాష్ట్ర ప్రభుత్వం 2014 లెక్కల ప్రకారం నిధులు ఇస్తే చాలని అంగీకరించిందని, 2017లో ఆ మేరకు కేంద్ర కేబినెట్‌లోనూ నిర్ణయం తీసుకున్నారంటూ ఆ నోట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఎత్తిచూపింది. కాబట్టి 2014 లెక్కల ప్రకారం 20వేల 389 కోట్ల రూపాయలకే డీపీఆర్‌ను ఆమోదించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కేంద్ర జలశక్తి శాఖకు నోట్ వెళ్లింది. గత రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికే కేంద్రం గట్టిగా పట్టుపడితే 29వేల కోట్ల మేర కొరత ఏర్పడుతుంది.

First Published:  26 Oct 2020 9:08 PM GMT
Next Story