Telugu Global
CRIME

తండ్రికి హత్య కేసులో జైలు శిక్ష... కొడుకు ఆత్మహత్య !

రైట్ టు ఇన్ ఫర్మేషన్ యాక్ట్… కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో శిక్షపడిన శివ సోలంకి కొడుకు మీత్ సోలంకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీత్ వయసు 24 సంవత్సరాలు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఇతను కోవిడ్ వ్యాప్తికి ముందు, ఎనిమిది నెలల క్రితం స్వదేశం తిరిగి వచ్చాడు. గుజరాత్, గిర్ సోమనాథ్ జిల్లా, కొడినార్ తాలూకాలోని దేవ్లి గ్రామంలో తన ఇంట్లోనే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీత్… సోమవారం మధ్యాహ్నం నుదుటికి కుడి […]

తండ్రికి హత్య కేసులో జైలు శిక్ష... కొడుకు ఆత్మహత్య !
X

రైట్ టు ఇన్ ఫర్మేషన్ యాక్ట్… కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో శిక్షపడిన శివ సోలంకి కొడుకు మీత్ సోలంకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీత్ వయసు 24 సంవత్సరాలు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఇతను కోవిడ్ వ్యాప్తికి ముందు, ఎనిమిది నెలల క్రితం స్వదేశం తిరిగి వచ్చాడు. గుజరాత్, గిర్ సోమనాథ్ జిల్లా, కొడినార్ తాలూకాలోని దేవ్లి గ్రామంలో తన ఇంట్లోనే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మీత్… సోమవారం మధ్యాహ్నం నుదుటికి కుడి వైపు కణత భాగంలో షూట్ చేసుకున్నాడని, తుపాకి పేలిన శబ్దం విని అతను ఉన్న గదికి వెళ్లిన కుటుంబ సభ్యులు… హాస్పటల్ కి తీసుకుని వెళ్లే సరికే మీత్ మరణించాడని పోలీసులు వెల్లడించారు. కొడినార్ టౌన్లోని తన స్నేహితుని వద్దనుండి మీత్… రివాల్వర్ ని తెచ్చుకుని దాంతో షూట్ చేసుకున్నాడని, తమకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని వారు తెలిపారు.

మీత్ తండ్రి శివ సోలంకి… జునాగఢ్ మాజీ బిజెపి ఎంపి దిను సోలంకికి సమీప బంధువు. ఆర్ టిఐ యాక్టివిస్టు అమిత్ జెత్వా హత్య కేసులో దిను సోలంకి, శివ సోలంకిలతో పాటు మరో అయిదుగురికి సిబిఐ కోర్టు గత ఏడాది జులై నెలలో యావజ్జీవ కారాగార శిక్షని విధించింది.

అమిత్ జెత్వా 2010లో అహ్మదాబాద్ లోని గుజరాత్ హైకోర్టు వద్ద కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. అమిత్ న్యాయవాది, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. జునాగఢ్ సమీపంలోని గిర్ అటవీ ప్రాంతంలో చాలా చురుగ్గా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాడు. గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో అక్రమంగా గనులను తవ్వడంపై ఇతను కోర్టులో అనేక కేసులు వేశాడు. అందుకు బాధ్యులుగా అతను పేర్కొన్న పేర్లలో దిను సోలంకి పేరు సైతం ఉంది. మరణించేనాటికి అమిత్ జెత్వా వయసు 35 సంవత్సరాలు.

First Published:  27 Oct 2020 8:14 AM GMT
Next Story