Telugu Global
National

టీడీపీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో 3 ఎకరాల 65 సెంట్లలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి వాగు పోరంబోకు భూమి. 2017లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. దీన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టును ఎమ్మెల్యే ఆర్కే ఆశ్రయించారు. వాగు భూమిని నిర్మాణాలకు కేటాయించడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. […]

టీడీపీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
X

తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో 3 ఎకరాల 65 సెంట్లలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి వాగు పోరంబోకు భూమి. 2017లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. దీన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టును ఎమ్మెల్యే ఆర్కే ఆశ్రయించారు.

వాగు భూమిని నిర్మాణాలకు కేటాయించడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే జులై నెలలో ఎమ్మెల్యే ఆర్కేపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ విషయంలో మీకున్న ఆసక్తి ఏమిటని హైకోర్టు నాడు మండిపడింది. దాంతో ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని టీడీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

First Published:  27 Oct 2020 9:04 AM GMT
Next Story