Telugu Global
Health & Life Style

ఆరోగ్య సేతు యాప్... ఎవరు క్రియేట్ చేశారో తెలియదట !

కోవిడ్ నివారణలో ఆరోగ్యసేతు యాప్ పేరు చాలా ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. దీనిని ప్రభుత్వమే రూపొందించి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ యాప్ క్రియేట్ చేసింది ఎవరో తెలియదని ప్రభుత్వ వైబ్ సైట్లను డిజైన్ చేసే ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ ఐ సి)…తెలిపింది. ఆరోగ్య సేతుని ఎవరు, ఎలా రూపొందించారో తమకు తెలియదని, ఆ సమాచారమేమీ తమ వద్ద లేదని ప్రకటించింది. ఈ సంస్థ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ […]

ఆరోగ్య సేతు యాప్... ఎవరు క్రియేట్ చేశారో తెలియదట !
X

కోవిడ్ నివారణలో ఆరోగ్యసేతు యాప్ పేరు చాలా ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. దీనిని ప్రభుత్వమే రూపొందించి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ యాప్ క్రియేట్ చేసింది ఎవరో తెలియదని ప్రభుత్వ వైబ్ సైట్లను డిజైన్ చేసే ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ ఐ సి)…తెలిపింది.

ఆరోగ్య సేతుని ఎవరు, ఎలా రూపొందించారో తమకు తెలియదని, ఆ సమాచారమేమీ తమ వద్ద లేదని ప్రకటించింది. ఈ సంస్థ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. కోవిడ్ 19 ట్రాకర్ గా వినియోగిస్తున్న ఆరోగ్య సేతు యాప్ గురించిన వివరాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి అప్లికేషన్ పెట్టటంతో ఈ వివరాలు బయటకు వచ్చాయి.

ఆరోగ్య సేతు యాప్ గురించి వివరాలు కావాలంటూ ఎన్ ఐసిని, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖని కోరగా వారినుండి ఎలాంటి వివరాలు అందలేదని, వారివద్ద యాప్ రూపకల్పనకు సంబంధించి ఎలాంటి డేటా లేదని సౌరవ్ దాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయటంతో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్పందించింది.

సమాచార హక్కు చట్టంతో అనుసంధానమై పనిచేస్తున్న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సిఐసి)… ఎన్ ఐ సిని తప్పుపడుతూ… పలువురు చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యాప్ గురించిన వివరాలతో సమాధానం చెప్పాలని సిఐసి వారిని కోరింది. జవాబు చెప్పటం తప్పనిసరి అని సిఐసి వెల్లడించింది.

లాక్ డౌన్ కాలంలో ఆరోగ్యసేతు యాప్ ని లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, మెట్రో స్టేషన్లు లాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవటం ఒక నిబంధనలా పాటిస్తున్నారు. ఈ నిబంధనని ప్రభుత్వమే విధించినట్టుగా అందరూ భావిస్తున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం వద్ద దీని తాలూకూ వివరాలేమీ లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం.

ఆరోగ్యసేతు యాప్ పేరు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వెబ్ సైట్ లో కనబడుతున్నా… దాని గురించిన సమాచారం ఎందుకు లేదని సిఐసి… ఎన్ ఐసిని అడిగింది. ఆరోగ్యసేతు యాప్ గురించి ఎలాంటి సమాచారం లేనప్పుడు అది జిఓవి.ఇన్ అనే డొమైన్ పేరుతో ఎలా క్రియేట్ అయ్యిందో ఎన్ ఐ సి రాత పూర్వకంగా చెప్పాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి సిఐసికి సూచించింది. ఇన్ఫర్మేషన్ కమిషనర్ వనజ ఎన్ శర్మ ఈ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు.

First Published:  28 Oct 2020 9:43 AM GMT
Next Story