Telugu Global
National

ఎన్నికలపై వివిధ పార్టీల అభిప్రాయాలు ఇవి....

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై వివిధ పార్టీల నుంచి ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ అభిప్రాయాలు తీసుకున్నారు. టీడీపీ తరపున హజరైన అచ్చెన్నాయుడు… ఎన్నికలు పెట్టడానికి వాతావరణం అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్లనే ఎన్నికలు నిర్వహించాలని కోరామని… ఎన్నికలకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. కరోనా ఎక్కువ వున్నప్పుడు వాయిదా వేస్తే తిట్టిన అధికార పార్టీ… ఇప్పుడు కరోనా తగ్గింది ఎన్నికలు పెడతామంటే వద్దంటోందని విమర్శించారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి కేంద్ర […]

ఎన్నికలపై వివిధ పార్టీల అభిప్రాయాలు ఇవి....
X

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై వివిధ పార్టీల నుంచి ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ అభిప్రాయాలు తీసుకున్నారు. టీడీపీ తరపున హజరైన అచ్చెన్నాయుడు… ఎన్నికలు పెట్టడానికి వాతావరణం అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్లనే ఎన్నికలు నిర్వహించాలని కోరామని… ఎన్నికలకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని చెప్పారు.

కరోనా ఎక్కువ వున్నప్పుడు వాయిదా వేస్తే తిట్టిన అధికార పార్టీ… ఇప్పుడు కరోనా తగ్గింది ఎన్నికలు పెడతామంటే వద్దంటోందని విమర్శించారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి కేంద్ర బలగాల సాయంతో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టిందని.. కాబట్టి 26 జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేసింది. 26 జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు పెడితే చాలా మంది బడుగు బలహీనవర్గాల వారికి అవకాశాలు దొరుకుతామని కాంగ్రెస్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ అధికారుల నుంచి సలహాలు తీసుకుని, ఎన్నికల నిర్వాహణపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్న తర్వాత ముందుకెళ్లాల్సిందిగా ఈసీకి సూచించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ఎన్నికల కంటే ప్రజారోగ్యం ముఖ్యమని… దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఎన్నికలు జరిగిన చోట ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అన్నది గమనించాలన్నారు. అక్కడ ఇబ్బందులు లేకపోతే వెంటనే ఇక్కడ ఎన్నికలు పెట్టవచ్చని… ఇబ్బందులు ఉంటే మాత్రం ఇక్కడ ఎన్నికలు పెట్టకుండా ఉంటే మంచిదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వంతో సమన్వయం చేసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలని… ఏకపక్షంగా ముందుకెళ్లడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని బీజేపీ అభిప్రాయపడింది. ఏకగ్రీవాలను రద్దు చేయాలని బీజేపీ కూడా డిమాండ్ చేసింది.

గతంతో పోలిస్తే కరోనా కేసులు పెరుగుతున్నాయని సీపీఎం తరపున హాజరైన వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈసీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో కంటే ఇప్పుడు కరోనా కేసులు, ఉధృతి అధికంగా ఉందని, అన్ని జిల్లాల్లోనూ కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని, పలు జిల్లాలు వరదల వల్ల ఇబ్బందుల్లో ఉన్నాయని… ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్ దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

మొయిల్ ద్వారా తమ అభిప్రాయం పంపిన జనసేన… ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్ధిస్తామని స్పష్టం చేసింది.

First Published:  28 Oct 2020 7:17 AM GMT
Next Story