Telugu Global
National

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన గీతం

గీతం యూనివర్శిటీ యాజమాన్యం మరో కొత్త డిమాండ్‌తో హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తమకు సమ్మతం కాదంటూ హైకోర్టులో అప్పీల్ చేసింది. కూల్చివేతకు ముందున్న పరిస్థితిని కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరింది. అంటే ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకున్న 38.53 ఎకరాలు కూడా తమ ఆధీనంలోనే ఉండేలా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని మరొకరికి కేటాయించే అవకాశం ఉందని అలాజరగకుండా చూడాలని కోరారు. ఇందుకు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి […]

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన గీతం
X

గీతం యూనివర్శిటీ యాజమాన్యం మరో కొత్త డిమాండ్‌తో హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తమకు సమ్మతం కాదంటూ హైకోర్టులో అప్పీల్ చేసింది. కూల్చివేతకు ముందున్న పరిస్థితిని కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరింది.

అంటే ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకున్న 38.53 ఎకరాలు కూడా తమ ఆధీనంలోనే ఉండేలా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని మరొకరికి కేటాయించే అవకాశం ఉందని అలాజరగకుండా చూడాలని కోరారు.

ఇందుకు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. కబ్జా చేసిందే కాకుండా ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే… తిరిగి తమకే అప్పగించాలని గీతం యాజమాన్యం కోరడం ఏమిటని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అని నిలదీశారు.

రెండు రోజుల్లో హైకోర్టు నుంచి తమకు సానుకూల ఉత్తర్వులు వస్తాయని గీతం చైర్మన్ భరత్ చెప్పుకుంటున్నారని… దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ లలితలతో కూడిన ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

First Published:  27 Oct 2020 10:10 PM GMT
Next Story