బాగా బరువు తగ్గిన హీరోయిన్

అవికా గౌర్ గుర్తుందా.. బొద్దుగా బూరెలా ఉండే ఈ హీరోయిన్ ఇప్పుడు ఒక్కసారిగా స్లిమ్ అయిపోయింది. అవును.. అమాంతం 13 కిలోల బరువు తగ్గింది అవికా గౌర్. ఈ లాక్ డౌన్ టైమ్ మొత్తాన్ని బరువు తగ్గడానికే ఉపయోగించినట్టు తెలిపింది ఈ బ్యూటీ.

“నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో (బొద్దుగా) ఆ ఫిజిక్ నే ప్రేక్షకులు ఇష్టపడ్డారు. కానీ ఇప్పటివరకు నేను వంద శాతం ప్రదర్శన ఇవ్వలేదనే భావిస్తున్నాను. అందుకే మరింత మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం బరువు తగ్గాను.”

ఇలా తను ఎందుకు బరువు తగ్గాల్సి వచ్చిందో వివరించింది అవికా గౌర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే హిందీ సీరియల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అది కూడా కాస్త వయసుమళ్లిన పాత్రలు పోషిస్తోంది. ఓవైపు ఇలాంటి పెద్ద తరహా పాత్రలు పోషిస్తూ, మరోవైపు స్లిమ్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోతాయని కొందరు అనుమానిస్తున్నారు.