Telugu Global
National

'గీతం' తప్పుడు పత్రాలతో యూజీసీని ఎలా మోసం చేసిందో యూజీసీ చైర్మన్ కు, కేంద్ర విద్యామంత్రికి లేఖలు రాసిన విజయసాయి రెడ్డి

గీతం మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఇటీవలే జాతీయ వైద్యమండలికి లేఖ రాసి కలకలం రేపిన ఎంపీ విజయసాయి రెడ్డి.. ఇప్పుడు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ ఫోక్రియాల్, యూజీసీ చైర్మన్ ధీరేంద్ర పాల్ సింగ్ కు మరో లేఖ రాశారు. డీమ్డ్ టు బి యూనివర్సిటీగా కొనసాగుతున్న గీతం విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఆ లేఖలో కోరారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని, గీతం కు ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేషన్ ఇప్పించాలని […]

గీతం తప్పుడు పత్రాలతో యూజీసీని ఎలా మోసం చేసిందో యూజీసీ చైర్మన్ కు, కేంద్ర విద్యామంత్రికి లేఖలు రాసిన విజయసాయి రెడ్డి
X

గీతం మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఇటీవలే జాతీయ వైద్యమండలికి లేఖ రాసి కలకలం రేపిన ఎంపీ విజయసాయి రెడ్డి.. ఇప్పుడు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ ఫోక్రియాల్, యూజీసీ చైర్మన్ ధీరేంద్ర పాల్ సింగ్ కు మరో లేఖ రాశారు. డీమ్డ్ టు బి యూనివర్సిటీగా కొనసాగుతున్న గీతం విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఆ లేఖలో కోరారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని, గీతం కు ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేషన్ ఇప్పించాలని కోరారు.

లేఖలో విజయసాయి పేర్కొన్న అంశాలు..

  • డీమ్డ్ టు బి యూనివర్సిటీగా గుర్తింపు తెచ్చుకునే క్రమంలో.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలను గీతం ఉల్లంఘించింది. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి మోసపూరితంగా యూజీసీ నుంచి గుర్తింపు తెచ్చుకుంది.
  • గీతం విద్యా సంస్థలు తమదిగా చెప్పుకుంటున్న స్థలం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానిది. 40ఎకరాల 51 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి గీతం విద్యా సంస్థలు అందులో బిల్డింగ్ లు నిర్మించాయి. ఇవన్నీ ఆక్రమణలు, అతిక్రమణలు. ఈ భూమి తమదేనంటూ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అనుమతి తీసుకోవడం నేరం.
  • యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెబ్ సైట్లో కూడా తప్పుడు ధృవీకరణ పత్రాలను గీతం విద్యాసంస్థ అప్ లోడ్ చేసింది. పబ్లిక్ డొమైన్ లో కూడా ఇలా తప్పుడు డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి యూజీసీని తప్పుదోవ పట్టించింది. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
  • నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్ లో పాల్గొన్న విద్యాసంస్థలకు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా లభిస్తుంది. అయితే గీతం.. NIRF లో పాల్గొన్నా కూడా తప్పుడు డాక్యుమెంట్స్ తోనే ర్యాంక్ సాధించింది. అడ్డదారిలో తెచ్చుకున్న ర్యాంక్ పరిగణలోకి తీసుకోకుండా గీతం కు డీమ్డ్ హోదా రద్దు చేయాల్సిందే.
  • రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు గీతం విద్యాసంస్థ పాల్పడుతోంది. డీమ్డ్ టు బి యూనివర్సిటీలో విద్యార్థుల ప్రవేశాలు, ఉద్యోగుల నియామకాల్లో రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి. కానీ గీతంలో ఇవేవీ కనిపించవు. అడ్మిషన్లు, రిక్రూట్ మెంట్ లో రిజర్వేషన్లు పాటించడంలేదు.
  • డీమ్డ్ హోదా తెచ్చుకున్న యూనివర్సిటీలన్నీ.. దూరవిద్యను ప్రోత్సహించాలి. కానీ గీతం ఆ విషయంలో వెనకపడింది. బెంగళూరులో ఆఫ్ క్యాంపస్ ప్రారంభించినా డిస్టెన్స్ కోర్స్ లు అందించడంలేదు. డిస్టెన్స్ లెర్నింగ్ విషయంలో యూజీసీ నిబంధనలను గీతం తుంగలో తొక్కింది.
  • డాక్టరేట్ పట్టాల విషయంలో కూడా దొంగలెక్కలతో యూజీసీని మభ్యపెడుతోంది గీతం విద్యా సంస్థ. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కి గీతం అందించిన పి.హెచ్.డి. జాబితా ఒకలా ఉంటే.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కి ఇచ్చిన లెక్క మరోలా ఉంది. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా 233. అంటే డాక్టరేట్ల విషయంలో గీతం మోసం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
  • నిబంధనలు ఉల్లంఘించినందుకు గీతం కు డీమ్డ్ హోదా రద్దు చేస్తే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది కాబట్టి.. వెంటనే గీతం కు ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేషన్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.

యూజీసీ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినందుకు గీతం విద్యా సంస్థలపై వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ ఫోక్రియాల్, యూజీసీ చైర్మన్ ధీరేంద్ర పాల్ సింగ్ కు లేఖ రాసిన విజయసాయిరెడ్డి…డీమ్డ్ హోదా రద్దు చేయాలని కోరారు.

First Published:  29 Oct 2020 4:37 AM GMT
Next Story