Telugu Global
CRIME

‘అది నీచమైన నేరం’... కోర్టు వ్యాఖ్య !

భార్య నగ్న ఫొటోలు, వీడియోలను తీసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ఒక వ్యక్తికి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది చాలా నీచమైన నేరమని, అతను చేసిన దారుణం తాలూకూ ప్రభావం ఆమెను మానసికంగా, శారీరకంగా, ఆత్మపరంగా ఎంతగా బాధిస్తుందో మనం ఊహించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మండీకి చెందిన సదరు వ్యక్తి … భార్య ఆమె తండ్రిని అడిగి […]

‘అది నీచమైన నేరం’... కోర్టు వ్యాఖ్య !
X

భార్య నగ్న ఫొటోలు, వీడియోలను తీసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ఒక వ్యక్తికి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది చాలా నీచమైన నేరమని, అతను చేసిన దారుణం తాలూకూ ప్రభావం ఆమెను మానసికంగా, శారీరకంగా, ఆత్మపరంగా ఎంతగా బాధిస్తుందో మనం ఊహించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

హిమాచల్ ప్రదేశ్ లోని మండీ అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మండీకి చెందిన సదరు వ్యక్తి … భార్య ఆమె తండ్రిని అడిగి టూ వీలర్ తీసుకుని రావాలని లేకపోతే ఆమె నగ్న ఫొటోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆమె అతడిని ఎదిరించడంతో తీవ్రంగా కొట్టటం, తిట్టడమే కాకుండా ఫేస్ బుక్ లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆమె ఫొటోలను పోస్ట్ చేశాడు. అంతకుముందు అతను ఫొటోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించినప్పుడే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఈ నెల మొదట్లోనే అతనిపై కేసు నమోదైంది.

బుధవారం నాడు హిమాచల ప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం అతను పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టివేసింది. ‘భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉండేందుకు వివాహ వ్యవస్థ స్ఫూర్తినిస్తుంది. భార్య నగ్న చిత్రాలను పబ్లిక్ డొమైన్ లో పోస్ట్ చేయటం… ఆ నమ్మకాన్ని కూలదోయటమే అవుతుంది. భార్య రక్షణకు కట్టుబడి ఉండాల్సిన భర్తే… నలుగురిలో ఆమెని వివస్త్రని చేయటంగా దీనిని భావించాలి’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

First Published:  28 Oct 2020 9:39 PM GMT
Next Story