ఇల్లాలిగా మారిన చందమామ

చందమామ కాజల్ పెళ్లయిపోయింది. ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ముంబయిలోని ఓ స్టార్ హోటల్ లో కాజల్ పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నిజానికి ఈ పెళ్లిని కాజల్ ఇంట్లోనే జరిపించాలని అనుకున్నారు. కానీ పెళ్లికి ముందు సంగీత్, మెహందీ లాంటివి ఇంట్లో చేసి, పెళ్లిని మాత్రం స్టార్ హోటల్ లో పెట్టుకున్నారు.

35 ఏళ్ల కాజల్ పెళ్లిపై దాదాపు రెండేళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఓ బిజినెస్ మేన్ తో ఆమె ఎఫైర్ లో ఉందంటూ చాలా స్టోరీలు వచ్చాయి. కానీ కాజల్ ఎప్పుడూ తన పెళ్లిపై, లవ్ ఎఫైర్ పై స్పందించలేదు. చివరికి అక్టోబర్ మొదటి వారంలో తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. అందులో కూడా గౌతమ్ ను తన ఫ్యామిలీ ఫ్రెండ్ గా చెప్పింది తప్ప, ప్రేమికుడు అని చెప్పలేదు.

త్వరలోనే కాజల్-గౌతమ్ ముంబయిలోని ఓ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నారు. కొన్నాళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవుతుంది కాజల్.