ప్రేరణ పని పూర్తిచేసిన పూజాహెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. ఆమె కాల్షీట్ దొరకడమే ఇప్పుడు గగనం అయిపోయింది. ఇలాంటి బిజీ టైమ్ లో ఆమెను రాధేశ్యామ్ మూవీ ఇబ్బంది పెడుతోంది. దాదాపు ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. దీంతో ఇతర సినిమాలకు కాల్షీట్లు కేటాయించడం పూజాకు తలనొప్పిగా మారింది.

అలా ఏడాదిగా ఇబ్బంది పెడుతున్న రాధేశ్యామ్ సినిమా నుంచి ఎట్టకేలకు బయటపడింది పూజా హెగ్డే. ఇటలీలో తాజాగా జరిగిన ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొని ఇండియాకు తిరిగొచ్చింది. నిజానికి సినిమాకు సంబంధించి పూజా పార్ట్ కంప్లీట్ అవ్వలేదు. ప్రభాస్-పూజాపై సాంగ్స్ తీయాలి. కానీ కీలకమైన టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వడంతో పూజా హెగ్డే ఊపిరి పీల్చుకుంది. సాంగ్స్ కు కావాలంటే ఎలాగైనా కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హీరోహీరోయిన్ మాత్రమే ఉంటే సరిపోతుంది.

మరోవైపు అఖిల్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చింది పూజా హెగ్డే. సో.. త్వరలోనే ఈమె నుంచి కొత్త సినిమాల ప్రకటనలు రాబోతున్నాయి.