Telugu Global
National

పబ్లిక్ ఎఫైర్‌ ఇండెక్స్‌లో ఏపీకి 3వ స్థానం...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలనలో మంచి మార్కులు సాధించింది. రాష్ట్రాల్లో పరిపాలన, స్థిరమైన అభివృద్ధి అంశాలపై పరిశోధన చేసిన పబ్లిక్ ఎఫైర్ సెంటర్‌ 2020కి సంబంధించిన తన నివేదికను విడుదల చేసింది. స్థిరమైన అభివృద్ధి, పరిపాలన అంశాల్లో ఆరోగ్యం, శిశుసంక్షేమం, పౌష్టికాహారం, రాజకీయ, పరిపాలన విభాగాల్లో లింగ సమానత్వం వంటి అనేక అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు. పెద్ద రాష్ట్రాల కేటగిరిలో ఇచ్చిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇండెక్స్ ర్యాంకుల్లో కేరళ తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ పరిపాలన […]

పబ్లిక్ ఎఫైర్‌ ఇండెక్స్‌లో ఏపీకి 3వ స్థానం...
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలనలో మంచి మార్కులు సాధించింది. రాష్ట్రాల్లో పరిపాలన, స్థిరమైన అభివృద్ధి అంశాలపై పరిశోధన చేసిన పబ్లిక్ ఎఫైర్ సెంటర్‌ 2020కి సంబంధించిన తన నివేదికను విడుదల చేసింది.

స్థిరమైన అభివృద్ధి, పరిపాలన అంశాల్లో ఆరోగ్యం, శిశుసంక్షేమం, పౌష్టికాహారం, రాజకీయ, పరిపాలన విభాగాల్లో లింగ సమానత్వం వంటి అనేక అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు.

పెద్ద రాష్ట్రాల కేటగిరిలో ఇచ్చిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇండెక్స్ ర్యాంకుల్లో కేరళ తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ పరిపాలన అందిస్తున్న రాష్ట్రంగా రెండో స్థానంలో తమిళనాడు నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. ఏపీ తర్వాత కర్నాటక ఉంది. తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌ అట్టడుగు స్థానానికి పరిమితం అయింది.

First Published:  30 Oct 2020 11:02 PM GMT
Next Story