Telugu Global
National

ఎయిర్ ఇండియాలో... మొట్టమొదటి మహిళా సీఈఓ హర్ ప్రీత్ ఎ డే సింగ్!  

ఎయిర్ ఇండియా మొట్టమొదటి మహిళా పైలట్ హర్ ప్రీత్ ఎ డే సింగ్…అలయన్స్ ఎయిర్ కి సిఇఓ గా నియమితులయ్యారు. ఇది ఎయిర్ ఇండియాకు అనుబంధ సంస్థ. దీంతో  ఎయిర్ ఇండియాలో మొట్టమొదట సీఈఓ హోదాని దక్కించుకున్న మహిళగా కూడా ఆమె ఘనతను సాధించారు. ప్రస్తుతం ఆమె ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (ఫ్లైట్ సేఫ్టీ విభాగంలో) గా ఉన్నారు. ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ బన్సాల్… హర్ ప్రీత్ నూతన బాధ్యతలకు సంబంధించిన […]

ఎయిర్ ఇండియాలో... మొట్టమొదటి మహిళా సీఈఓ హర్ ప్రీత్ ఎ డే సింగ్!  
X

ఎయిర్ ఇండియా మొట్టమొదటి మహిళా పైలట్ హర్ ప్రీత్ ఎ డే సింగ్…అలయన్స్ ఎయిర్ కి సిఇఓ గా నియమితులయ్యారు. ఇది ఎయిర్ ఇండియాకు అనుబంధ సంస్థ. దీంతో ఎయిర్ ఇండియాలో మొట్టమొదట సీఈఓ హోదాని దక్కించుకున్న మహిళగా కూడా ఆమె ఘనతను సాధించారు.

ప్రస్తుతం ఆమె ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (ఫ్లైట్ సేఫ్టీ విభాగంలో) గా ఉన్నారు. ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ బన్సాల్… హర్ ప్రీత్ నూతన బాధ్యతలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తూ… తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె ఆ విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం హీర్ ప్రీత్ నిర్వహిస్తున్న బాధ్యతలను కెప్టెన్ నివేదితా భాసిన్ కి అప్పగించారు.

హర్ ప్రీత్ 1988లో మొట్టమొదటి మహిళా కమర్షియల్ పైలట్ గా ఇండియన్ ఎయిర్ లైన్స్ లో చేరారు. అయితే కొన్ని అనారోగ్య కారణాల వలన ఆమె తన పైలట్ జాబ్ ని వదులుకోవాల్సి వచ్చింది.

2018లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్ లైన్ పైలట్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతదేశంలో మహిళా పైలట్లు ప్రపంచ సగటు కంటే ఎక్కువ మందే ఉన్నారు. అలయన్స్ ఎయిర్… గత ఏడాది అక్టోబరులో తమ సంస్థని మరింతగా విస్తరించబోతున్నామని, నూతన ప్రయాణ మార్గాలకు సైతం తాము విమానాలు నడపబోతున్నామని ప్రకటించింది. ప్రధానంగా డొమెస్టిక్ రూట్లలోనే విమానాలను నడుపుతున్న ఈ సంస్థ గత ఏడాదే చెన్నై నుండి జాఫ్నాకు తన తొలి విదేశీ విమానాన్ని ప్రారంభించింది.

First Published:  2 Nov 2020 8:20 AM GMT
Next Story