Telugu Global
National

వచ్చే ఎన్నికలనాటికి అమరావతి వర్సెస్ విశాఖ...

తన ఐదేళ్ల పాలనలో రాజధానిగా ప్రకటించిన అమరావతికి చంద్రబాబు అన్నీ చేసిఉంటే.. అక్కడి ప్రజలు, రైతులు ఇన్ని అవస్థలు పడేవారు కాదు. చేసిందంతా పేపర్ వర్క్, గ్రాఫిక్ వర్క్. కేవలం తాత్కాలిక కట్టడాలు చూపించి, విదేశీ డిజైన్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలక్షేపం చేశారు బాబు. పైగా కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కూడా. అన్నీ ఉన్నా అప్పుడు అమరావతికి ఏమీ చేయలేకపోయారు, అన్నీ సగం సగం చేసి సరిపెట్టారు. ఇప్పుడు అమరావతిని కాదని […]

వచ్చే ఎన్నికలనాటికి అమరావతి వర్సెస్ విశాఖ...
X

తన ఐదేళ్ల పాలనలో రాజధానిగా ప్రకటించిన అమరావతికి చంద్రబాబు అన్నీ చేసిఉంటే.. అక్కడి ప్రజలు, రైతులు ఇన్ని అవస్థలు పడేవారు కాదు. చేసిందంతా పేపర్ వర్క్, గ్రాఫిక్ వర్క్. కేవలం తాత్కాలిక కట్టడాలు చూపించి, విదేశీ డిజైన్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలక్షేపం చేశారు బాబు. పైగా కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కూడా. అన్నీ ఉన్నా అప్పుడు అమరావతికి ఏమీ చేయలేకపోయారు, అన్నీ సగం సగం చేసి సరిపెట్టారు.

ఇప్పుడు అమరావతిని కాదని విశాఖను సీఎం జగన్ పాలనా రాజధానిగా ఎంచుకున్నారు. కోర్టు కేసులు ఎదురవుతున్నా.. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నా విశాఖలో మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు ఆగలేదు. మెట్రో రైల్ కి డీపీఆర్ రెడీ అవుతోంది. టెండర్లు పిలవడం ఆలస్యం.. రెండేళ్లలో టెస్ట్ రన్ మొదలు పెట్టే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

ఐదేళ్ల కాలంలో అమరావతిలో మెట్రో రైలు పనుల్ని కనీసం మొదలు పెట్టలేక పోయింది టీడీపీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకే విశాఖ మెట్రో కల సాకారం అయితే అది కచ్చితంగా వైసీపీ విజయమే అవుతుంది.

ఇక భోగాపురం ఎయిర్ పోర్ట్. ఏపీలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ గా ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కి డిసెంబర్ లో సీఎం శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. మూడేళ్లలో నిర్మాణం ఓ కొలిక్కి వస్తుందని చెబుతున్నారు కూడా. ఈ రెండూ అనుకున్న టైమ్ కి పూర్తయితే.. అభివృద్ధి విషయంలో అమరావతి, విశాఖ మధ్య పోలిక, పోటీ కచ్చితంగా వస్తుంది.

అమరావతి విషయంలో అన్నీ అనుకూలంగా ఉన్నా, కేంద్రంలో కొన్నాళ్లు భాగస్వామిగా ఉన్నా కూడా.. ఏమీ చేయలేకపోయారు బాబు. ఇప్పుడు ప్రతిపక్షాలు అడ్డుపుల్లలు వేస్తున్నా, కోర్టు కేసులు ఎదురవుతున్నా.. అభివృద్ధి ఆగకుండా చేయగలుగుతోంది వైసీపీ ప్రభుత్వం. 2024నాటికి అభివృద్ధే ప్రధాన అజెండా అయితే.. అమరావతిలో ఏమీ చేయలేకపోయిన టీడీపీ తప్పిదాలను వైసీపీ ఎత్తి చూపుతుంది. విశాఖలో తాము చేసిన పనులన్నిటిపై గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. అదే జరిగితే కళ్లముందు జరిగిన అభివృద్ధి మాత్రమే ప్రజలను ఆకట్టుకుంటుంది అని చెప్పక తప్పదు.

అమరావతిలో ఆకాశ హర్మ్యాలకోసం చేసిన గ్రాఫిక్ వర్క్ కంటే.. విశాఖలో జరిగిన పనులే అందరినీ ఆలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. అందులోనూ విశాఖ అభివృద్ధిపై కృతనిశ్చయంతో ఉన్న జగన్ సర్కారు.. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లతో సాగర తీరానికి సరికొత్త కళ తీసుకు రావాలనే ప్రణాళికతో ఉంది. 2024నాటికి ఏపీ ఎన్నికల్లో అమరావతి వర్సెస్ విశాఖ అనే పోటీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.

First Published:  3 Nov 2020 1:10 AM GMT
Next Story