Telugu Global
International

ఆసక్తికరంగా అమెరికా ఎన్నికలు

అమెరికా అధ్యక్ష పీఠం కోసం ప్రతీ నాలుగేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 3నే అధికారికంగా పోలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ ఓటర్లు ఆన్‌లైన్ ద్వారాగానీ, ఎర్లీ ఓటింగ్ బూత్‌ల వద్ద కానీ ఓటు హక్కును ముందుగానే ఉపయోగించుకునే వెసులుబాటు ఉన్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ సారి ఎన్నికల బరిలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున, జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. […]

ఆసక్తికరంగా అమెరికా ఎన్నికలు
X

అమెరికా అధ్యక్ష పీఠం కోసం ప్రతీ నాలుగేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 3నే అధికారికంగా పోలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ ఓటర్లు ఆన్‌లైన్ ద్వారాగానీ, ఎర్లీ ఓటింగ్ బూత్‌ల వద్ద కానీ ఓటు హక్కును ముందుగానే ఉపయోగించుకునే వెసులుబాటు ఉన్నది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ సారి ఎన్నికల బరిలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున, జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

గత నాలుగేళ్ల పాలనలో ట్రంప్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని పలు సర్వేలు తేల్చాయి. అయితే పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ క్యాంప్ నిర్వహించిన ర్యాలీలు, పలు ప్రచార సభల ద్వారా భారీగానే మద్దతు కూడగట్టినట్లు సమాచారం. నల్లజాతీయులు ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత కొన్ని నెలలుగా అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న దాడుల వల్ల నల్లజాతీయులు అతడికి వ్యతిరేకంగా ఉన్నారు.

మరోవైపు మొదట్లో భారీ మద్దతు కూడగట్టుకున్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోయినట్లు తెలుస్తున్నది. ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం ట్రంప్ కంటే జో బైడెన్ కేవలం 3 శాతం ఆధిక్యత మాత్రమే కలిగి ఉన్నారు. రియల్ ఓటింగ్‌కు వచ్చే సరికి ఈ తేడా చాలా స్వల్పంగా ఉంటుందని.. ట్రంప్, బైడెన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నదని తెలుస్తున్నది.

అమెరికాలో దాదాపు 23.6 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 10 కోట్ల మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన వారిలో ఎంత మంది పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేస్తారనేది ఇంకా తేలలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికంగా 1900లో 60 శాతం పోలింగ్ జరిగింది. ఆ తర్వాత ఎప్పడూ అంత శాతం పోలింగ్ జరగలేదు. దీంతో మంగళవారం జరిగే పోలింగ్‌కు భారీ సంఖ్యలో ఓటర్లు తరలి వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో జో బైడెన్‌కే మొగ్గు కనిపిస్తున్నది. సీఎన్ఎన్, ఎన్‌బీసీ, ఫాక్స్ న్యూస్, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ వంటి సంస్థలు ప్రీ పోల్ సర్వేలు నిర్వహించాయి. అయితే గతంలో కూడా హిల్లరి క్లింటన్ గెలుస్తుందని మీడియా సంస్థలు వెల్లడించినా చివరకు ట్రంప్ గెలిచారు. ఈ సారి కూడా అలాగే సర్వేలు తిరగబడే అవకాశం కూడా ఉందంటున్నారు.

First Published:  3 Nov 2020 2:47 AM GMT
Next Story