Telugu Global
International

‘ఎలా ఉండాలనుకుంటే... అలా ఉండే అవకాశం మనకుంది’ !

జీవితంలో మనకు అందినవాటికంటే… అందనివాటిని, అందుకోలేనివాటినే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. చాలామంది ఇలాగే ఉంటారు.  పదేపదే దొరకనివాటినే గుర్తు చేసుకుంటూ నిరాశా నిస్పృహలకు గురవుతుంటారు. అది మానవ సహజం. కానీ రెండుకాళ్లు, రెండుచేతులు లేకుండా జన్మించిన నిక్ వుజిసిక్ మాత్రం… ఎలాంటి నిరాశకు గురికాకుండా… ‘మనం ఎలా ఉండాలో నిర్ణయించుకునే ఛాయిస్ మనకుంది… దాన్ని మనం వినియోగించుకోవాలి… ’ అంటున్నాడు. టెట్రా అమిలియా సిండ్రోమ్ కారణంగా అవయవ లోపంతో జన్మించిన నిక్… ఇప్పుడు అన్ని అవయవాలు సవ్యంగా ఉండీ… […]

‘ఎలా ఉండాలనుకుంటే... అలా ఉండే అవకాశం మనకుంది’ !
X

జీవితంలో మనకు అందినవాటికంటే… అందనివాటిని, అందుకోలేనివాటినే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. చాలామంది ఇలాగే ఉంటారు. పదేపదే దొరకనివాటినే గుర్తు చేసుకుంటూ నిరాశా నిస్పృహలకు గురవుతుంటారు. అది మానవ సహజం. కానీ రెండుకాళ్లు, రెండుచేతులు లేకుండా జన్మించిన నిక్ వుజిసిక్ మాత్రం… ఎలాంటి నిరాశకు గురికాకుండా… ‘మనం ఎలా ఉండాలో నిర్ణయించుకునే ఛాయిస్ మనకుంది… దాన్ని మనం వినియోగించుకోవాలి… ’ అంటున్నాడు.

టెట్రా అమిలియా సిండ్రోమ్ కారణంగా అవయవ లోపంతో జన్మించిన నిక్… ఇప్పుడు అన్ని అవయవాలు సవ్యంగా ఉండీ… తామెందుకూ పనికిరామనే నిరాశాభావంతో ఉన్న ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. అతనిప్పుడు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్.

‘పిల్లల పట్ల ప్రేమ, అంకితభావం ఉంటే చాలు వాళ్లు ఎలాంటి ఆటంకాలనైనా జయించేస్తారు. వాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మనం ఎవరినైనా బాధపెట్టాలన్నా, నిరాశకు గురిచేయాలన్నా… అలాంటి మాటలు మాట్లాడేందుకు మూడు సెకన్లు చాలు, కానీ ఆ మాటలను భరించినవారు వాటిని జీవితాంతం మర్చిపోలేరు’ అంటున్నాడు నిక్. నోవిశాడ్ లో జరిగిన టెడెక్స్ నోవిశాడ్ టాక్ లో అతనీమాటలు చెప్పాడు.

‘నన్ను చూసినవారందరూ నీకేమైంది అని అడుగుతుంటారు. కానీ నా దృష్టి నాకేదో అయింది… అనే దానిమీద ఉండదు. నా ముందున్న ఆటంకాలను అవకాశాలుగా మార్చుకోవటంపైనే నేను నా ధ్యాసపెడతాను. బిలియనీరైనా పేదవాడైనా… ఎవరైనా ఆశతో జీవించాలనే చూస్తారు. ఎందుకంటే మన పుట్టుకలోనే అలాంటి ఆశాభావం ఉంది. నా తల్లిదండ్రులు నాకు ఒక మాట చెబుతుంటారు. మనకు లేనివాటి గురించి ఆలోచించి కోపం తెచ్చుకోవాలా… ఉన్నవాటి పట్ల కృతజ్ఞతగా ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంది అని. అలా ఎంచుకునే అవకాశం ఉండటం వల్లనే నేను నా ఆటంకాలను జయించగలుగుతున్నాను. ప్రేమ, ఆశ ఇవి రెండు మనకు లేవు అనిపించినప్పుడు… బతికేందుకు సరిపడా శక్తి మనకు లేదనిపిస్తుంది’ అంటాడు నిక్.

‘ఇలా ఉన్నా నేను అందంగానే ఉన్నానని నా తల్లిదండ్రులు చెప్పకపోతే, నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తినని, నన్ను వాళ్లు ఎంతో ప్రేమిస్తున్నారని నా తల్లిదండ్రులు నాతో అనకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. తమ టీనేజి పిల్లలను ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క తల్లినీ తండ్రినీ నేను ప్రోత్సహిస్తున్నాను’ అన్నాడు నిక్ వుజిసిక్.

First Published:  3 Nov 2020 6:08 AM GMT
Next Story