Telugu Global
Cinema & Entertainment

అభిమాని కోసం ఎన్టీఆర్...

కష్టాల్లో ఉన్న అభిమానుల్ని ఆదుకోవడంలో, వాళ్లకు ధైర్యం అందించడంలో టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. ఇక ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన ప్రతి పబ్లిక్ మీటింగ్ లో, సినిమా ఫంక్షన్ లో అభిమానులకు జాగ్రత్తలు చెబుతుంటాడు తారక్. జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని, వేగంగా బండి నడపొద్దని, హెల్మెట్ పెట్టుకోమని సూచిస్తుంటాడు. అలాంటి ఎన్టీఆర్, ఇప్పుడు తన అభిమాని కోసం మరో అడుగు ముందుకేశాడు. వెంకన్న అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడి, అతడిలో ఆనందం-ధైర్యం […]

అభిమాని కోసం ఎన్టీఆర్...
X

కష్టాల్లో ఉన్న అభిమానుల్ని ఆదుకోవడంలో, వాళ్లకు ధైర్యం అందించడంలో టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. ఇక ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన ప్రతి పబ్లిక్ మీటింగ్ లో, సినిమా ఫంక్షన్ లో అభిమానులకు జాగ్రత్తలు చెబుతుంటాడు తారక్.

జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని, వేగంగా బండి నడపొద్దని, హెల్మెట్ పెట్టుకోమని సూచిస్తుంటాడు. అలాంటి ఎన్టీఆర్, ఇప్పుడు తన అభిమాని కోసం మరో అడుగు ముందుకేశాడు. వెంకన్న అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడి, అతడిలో ఆనందం-ధైర్యం నింపాడు.

వెంకన్న అనే అభిమాని తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, స్వయంగా అతడితో వీడియో కాల్ లో మాట్లాడాడు. వెంకన్నకు అన్ని విధాలుగా సాయం అందిస్తానని మాటిచ్చాడు.

అంతేకాదు.. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత తప్పకుండా తను వెంకన్న ఇంటికొస్తానని, వెంకన్నతో కలిసి సెల్ఫీ దిగుతానని హామీ ఇచ్చాడు ఎన్టీఆర్.

First Published:  3 Nov 2020 9:12 AM GMT
Next Story