Telugu Global
Cinema & Entertainment

ఆచార్య క్రేజీ అప్ డేట్

ఎట్టకేలకు ఆచార్య సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ఈనెల 9 నుంచి ఈ సినిమాను తిరిగి ప్రారంభించబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. అంతేకాదు.. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ ప్రాజెక్టులో మ్యాగ్జిమమ్ షూటింగ్ ను కంప్లీట్ చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా మరో క్రేజీ అప్ డేట్ కూడా ఇచ్చింది యూనిట్. ఆచార్య సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సంక్రాంతికి ఆచార్యను […]

ఆచార్య క్రేజీ అప్ డేట్
X

ఎట్టకేలకు ఆచార్య సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ఈనెల 9 నుంచి ఈ సినిమాను తిరిగి ప్రారంభించబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. అంతేకాదు.. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ ప్రాజెక్టులో మ్యాగ్జిమమ్ షూటింగ్ ను కంప్లీట్ చేస్తామని ప్రకటించింది.

ఈ సందర్భంగా మరో క్రేజీ అప్ డేట్ కూడా ఇచ్చింది యూనిట్. ఆచార్య సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సంక్రాంతికి ఆచార్యను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా/లాక్ డౌన్ వల్ల షూటింగ్ లేట్ అవ్వడంతో సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమాలన్నీ ఆగిపోయాయి. ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వాల్సిన ఉప్పెన, రెడ్, రంగ్ దే లాంటి సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి.

ఇక ఆచార్య సినిమాకు సంబంధించి కాజల్ విషయానికొస్తే, మొన్ననే ఆమె పెళ్లి చేసుకుంది. కాబట్టి కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని సెట్స్ పైకి వస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ కాజల్ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. త్వరలోనే ఆమె ఓ తమిళ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఆ వెంటనే ఆచార్య సినిమా సెట్స్ పైకి వస్తుంది.

First Published:  4 Nov 2020 8:15 AM GMT
Next Story