Telugu Global
International

ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నాం... కానీ భారీ విజయం సాధించాం " ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తాము భారీ విజయాన్ని సాధించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల సరళిపై మాట్లాడిన ట్రంప్‌… ఊహకందని ఫలితాలు వస్తున్నాయన్నారు. ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నామని… కానీ అక్కడ కూడా భారీ విజయం దక్కిందన్నారు ట్రంప్. కోట్లాది మంది ఉన్న టెక్సాస్‌లోనూ తాము గెలిచామన్నారు. జార్జియాలోనూ ఊహించని విజయం దక్కబోతోందన్నారు. ఓట్లేసిన కోట్లాది మంది అమెరికన్లకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. పలు కీలక రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలో ఉన్నామని… భారీ విజయం సాధించబోతున్నామని… భారీగా సంబరాలు చేసుకుందాం […]

ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నాం... కానీ భారీ విజయం సాధించాం  ట్రంప్
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తాము భారీ విజయాన్ని సాధించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల సరళిపై మాట్లాడిన ట్రంప్‌… ఊహకందని ఫలితాలు వస్తున్నాయన్నారు.

ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నామని… కానీ అక్కడ కూడా భారీ విజయం దక్కిందన్నారు ట్రంప్. కోట్లాది మంది ఉన్న టెక్సాస్‌లోనూ తాము గెలిచామన్నారు. జార్జియాలోనూ ఊహించని విజయం దక్కబోతోందన్నారు. ఓట్లేసిన కోట్లాది మంది అమెరికన్లకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.

పలు కీలక రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలో ఉన్నామని… భారీ విజయం సాధించబోతున్నామని… భారీగా సంబరాలు చేసుకుందాం అంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. చివరి క్షణంలో ఓట్ల లెక్కింపులో మోసాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.

First Published:  4 Nov 2020 2:21 AM GMT
Next Story