Telugu Global
Cinema & Entertainment

నిధి అగర్వాల్ తమిళ పాఠాలు

నిధి అగర్వాల్ కొత్త పని పెట్టుకుంది. కరోనా కాలంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలుపెట్టింది. తన చేతిలో ఉన్న సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తోంది. ఇలా ఓవైపు షూటింగ్స్ కు హాజరవుతూనే, మరోవైపు ఆన్ లైన్ లో తమిళ పాఠాలు నేర్చుకుంటోంది ఈ బ్యూటీ. తెలుగులో బిజీగా ఉన్న నిధి, హఠాత్తుగా తమిళ పాఠాలు నేర్చుకోవడం ఏంటనేగా మీ సందేహం. ఆమె ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేసింది. ఆల్రెడీ ‘భూమి’ అనే సినిమా […]

నిధి అగర్వాల్ తమిళ పాఠాలు
X

నిధి అగర్వాల్ కొత్త పని పెట్టుకుంది. కరోనా కాలంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలుపెట్టింది. తన చేతిలో ఉన్న సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తోంది. ఇలా ఓవైపు షూటింగ్స్ కు హాజరవుతూనే, మరోవైపు ఆన్ లైన్ లో తమిళ పాఠాలు నేర్చుకుంటోంది ఈ బ్యూటీ.

తెలుగులో బిజీగా ఉన్న నిధి, హఠాత్తుగా తమిళ పాఠాలు నేర్చుకోవడం ఏంటనేగా మీ సందేహం. ఆమె ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేసింది. ఆల్రెడీ ‘భూమి’ అనే సినిమా చేస్తోంది. త్వరలోనే మరిన్ని సినిమాలకు సైన్ చేయాలనుకుంటోంది. తమిళ్ నేర్చుకుంటే కోలీవుడ్ లో మరింత బాగా రాణించవచ్చనేది నిధి అభిప్రాయం. అందుకే ఇలా ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతోంది.

ప్రస్తుతం తెలుగులో అశోక్ గల్లా హీరోగా పరిచయమౌతున్న సినిమాలో నటిస్తోంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు సినిమా ఇదే. ఈ మూవీతో పాటు తమిళ్ లో ఈశ్వరన్ (తెలుగులో ఈశ్వరుడు) అనే సినిమాకు కూడా కాల్షీట్లు కేటాయించింది నిధి. అవకాశాలు వస్తే కోలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది ఈ మంగుళూరు బ్యూటీ.

First Published:  4 Nov 2020 8:30 PM GMT
Next Story