Telugu Global
Cinema & Entertainment

మెట్రో ఎక్కిన వకీల్ సాబ్

పవన్ కల్యాణ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. ఆయన ఫొటోలన్నీ సెడన్ గా వైరల్ అయ్యాయి. దీనికి కారణం, పవన్ కల్యాణ్ మెట్రో రైల్ ఎక్కడమే. ఊహించని విధంగా మెట్రో రైలు ఎక్కి షూటింగ్ స్పాట్ కు చేరుకున్నాడు పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ షూటింగ్ ను మియాపూర్ లో ప్లాన్ చేశారు. ఈ లొకేషన్ కు చేరుకునేందుకు మాదాపూర్ లో మెట్రో ఎక్కాడు పవన్. పవన్ తో పాటు నిర్మాత దిల్ రాజు, ఇతర […]

మెట్రో ఎక్కిన వకీల్ సాబ్
X

పవన్ కల్యాణ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. ఆయన ఫొటోలన్నీ సెడన్ గా వైరల్ అయ్యాయి. దీనికి కారణం, పవన్ కల్యాణ్ మెట్రో రైల్ ఎక్కడమే. ఊహించని విధంగా మెట్రో రైలు ఎక్కి షూటింగ్ స్పాట్ కు చేరుకున్నాడు పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ షూటింగ్ ను మియాపూర్ లో ప్లాన్ చేశారు. ఈ లొకేషన్ కు చేరుకునేందుకు మాదాపూర్ లో మెట్రో ఎక్కాడు పవన్.

పవన్ తో పాటు నిర్మాత దిల్ రాజు, ఇతర యూనిట్ సభ్యులు కూడా మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. పవన్ మామూలుగా మెట్రో ఎక్కలేదు. ఆయన వకీల్ సాబ్ గెటప్ లోనే ఉన్నాడు. లాయర్ గెటప్ కోసం చక్కగా సూట్ వేసుకొని మరీ మెట్రో స్టేషన్ కు వచ్చాడు పవన్. అతడితో పాటు నిర్మాత దిల్ రాజు కూడా మెట్రోలో ప్రయాణించాడు.

First Published:  5 Nov 2020 10:20 AM GMT
Next Story