Telugu Global
Cinema & Entertainment

నితిన్ మళ్లీ హిట్ కొట్టాడు

రీసెంట్ గా నితిన్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. భీష్మ సినిమా తర్వాత నితిన్ నుంచి మూవీ రాలేదు. మరి ఫ్రెష్ గా నితిన్ కు హిట్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఇది బుల్లితెర విజయం. సిల్వర్ స్క్రీన్ పై భీష్మతో సూపర్ హిట్ అందుకున్న నితిన్, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా అదే సినిమాతో హిట్ కొట్టాడు. దసరా కానుకగా భీష్మ సినిమాను ప్రసారం చేసింది జెమినీ ఛానెల్. ఈ సినిమాకు అత్యథికంగా 6.65 (ఏపీ+తెలంగాణ […]

నితిన్ మళ్లీ హిట్ కొట్టాడు
X

రీసెంట్ గా నితిన్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. భీష్మ సినిమా తర్వాత నితిన్ నుంచి మూవీ రాలేదు. మరి ఫ్రెష్ గా నితిన్ కు హిట్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఇది బుల్లితెర విజయం. సిల్వర్ స్క్రీన్ పై భీష్మతో సూపర్ హిట్ అందుకున్న నితిన్, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా అదే సినిమాతో హిట్ కొట్టాడు.

దసరా కానుకగా భీష్మ సినిమాను ప్రసారం చేసింది జెమినీ ఛానెల్. ఈ సినిమాకు అత్యథికంగా 6.65 (ఏపీ+తెలంగాణ అర్బన్) టీఆర్పీ రావడం విశేషం. అలా దసరా బరిలో నితిన్ భీష్మ తో మరోసారి సక్సెస్ అందుకున్నాడు.

నిజానికి దసరా ఎట్రాక్షన్లలో భాగంగా భీష్మకు పెద్దగా పోటీ తగల్లేదు. స్టార్ మా ఛానెల్ సైకో అనే డబ్బింగ్ సినిమాను ప్రసారం చేస్తే, జీ తెలుగు ఛానెల్ కోటికొక్కడు అనే మరో డబ్బింగ్ సినిమాను టెలికాస్ట్ చేసింది. పైగా ఈ రెండూ భీష్మ స్లాట్ లో కాకుండా మధ్యాహ్నం ప్రసారమయ్యాయి.

అలా సోలోగా బుల్లితెరపైకొచ్చిన భీష్మ సాలిడ్ టీఆర్పీ అందుకున్నాడు. ఉదయనిథి స్టాలిన్, అదితిరావు నటించిన సైకో సినిమా రెండో స్థానంలో నిలిచింది.

First Published:  6 Nov 2020 4:00 AM GMT
Next Story