Telugu Global
Cinema & Entertainment

తన బిడ్డను తానే చంపేసుకున్న లాస్య

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న లాస్య తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని బయటపెడుతోంది. తన ప్రేమ విషయాలతో పాటు, పెళ్లి సంగతుల్ని బిగ్ బాస్ వేదికగానే బయటపెట్టింది ఈ మాజీ యాంకర్. ఇప్పుడీ ముద్దుగుమ్మ తన జీవితంలో ఓ విషాద ఘటనను బయటపెట్టింది. తన బిడ్డను తానే చంపేసుకున్నానంటూ బాధపడింది. ఎవ్వరికీ తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా 2010లోనే పెళ్లి చేసుకుంది లాస్య. అయితే రెండేళ్ల వరకు వేర్వేరుగా ఉంటూ వచ్చారు. 2012 నుంచి […]

తన బిడ్డను తానే చంపేసుకున్న లాస్య
X

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న లాస్య తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని బయటపెడుతోంది. తన ప్రేమ విషయాలతో పాటు, పెళ్లి సంగతుల్ని బిగ్ బాస్ వేదికగానే బయటపెట్టింది ఈ మాజీ యాంకర్. ఇప్పుడీ ముద్దుగుమ్మ తన జీవితంలో ఓ విషాద ఘటనను బయటపెట్టింది. తన బిడ్డను తానే చంపేసుకున్నానంటూ బాధపడింది.

ఎవ్వరికీ తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా 2010లోనే పెళ్లి చేసుకుంది లాస్య. అయితే రెండేళ్ల వరకు వేర్వేరుగా ఉంటూ వచ్చారు. 2012 నుంచి కాపురం స్టార్ట్ చేశారు. అప్పటికీ లాస్యకు పెళ్లయినట్టు చాలామందికి తెలియదు. 2014లో లాస్య పెళ్లిని ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నారు.

పెళ్లి చేసుకున్న విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని తామే దగ్గరుండి మళ్లీ పబ్లిక్ గా పెళ్లి చేస్తామని చెప్పడంతో లాస్య హ్యాపీగా ఫీల్ అయింది. అయితే అదే టైమ్ లో ఆమె గర్భవతి అయిందట. పెళ్లి అయిన విషయాన్ని బయటకు చెప్పలేక, గర్భాన్ని కొనసాగించలేక చాలా మధనపడిందట లాస్య. అలా 2 రోజులు ఆలోచించి అబార్షన్ చేయించుకుందట.

ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌజ్ లో బయటపెట్టింది లాస్య. పుట్టబోయే బిడ్డను తనే చంపుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తనకు శిక్షగా 2017లో గర్భం దాల్చినప్పటికీ మిస్ క్యారేజ్ అయిందని చెప్పుకొచ్చింది. అలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2018లో బాబు పుట్టిన విషయాన్ని చెప్పుకొచ్చింది లాస్య. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే లాస్య జీవితంలో ఇంత పెయిన్ ఉందనే విషయం జనాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

First Published:  6 Nov 2020 8:43 AM GMT
Next Story