Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ నుంచి మరో ట్రెండింగ్ పిక్

ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి పండగ చేసుకున్నారు. మినిమం గ్యాప్స్ లో ఈ హీరో తన సినిమాలకు సంబంధించి అప్ డేట్స్, కొత్త ఫొటోలు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాడు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇందులో భాగంగా ప్రభాస్ నుంచి మరో పిక్ రిలీజైంది. నిన్నట్నుంచి ఆ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో భాగంగా ప్రభాస్ పై తీసిన ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]

ప్రభాస్ నుంచి మరో ట్రెండింగ్ పిక్
X

ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి పండగ చేసుకున్నారు. మినిమం గ్యాప్స్ లో ఈ హీరో తన సినిమాలకు సంబంధించి అప్ డేట్స్, కొత్త ఫొటోలు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాడు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇందులో భాగంగా ప్రభాస్ నుంచి మరో పిక్ రిలీజైంది. నిన్నట్నుంచి ఆ ఫొటో తెగ వైరల్ అవుతోంది.

‘రాధేశ్యామ్’ షూటింగ్ లో భాగంగా ప్రభాస్ పై తీసిన ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటలీలో తీసిన ఈ పిక్ లో ప్రభాస్ ఓ కారు పక్కన రాయల్ గా నిల్చొన్నాడు. ఈ స్టిల్ సినిమాలో ఉంటుందా లేదా వర్కింగ్ స్టిల్లా అనే సంగతి పక్కనపెడితే.. 24 గంటలుగా ఇది సోషల్ మీడియాను మాత్రం ఊపేస్తోంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ”రాధేశ్యామ్” సినిమా, యూరోపియన్ బ్యాక్ డ్రాప్ లో పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇందులో విక్రమాదిత్య రోల్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

First Published:  6 Nov 2020 12:00 AM GMT
Next Story