Telugu Global
Cinema & Entertainment

సమంత ఇక సినిమాలు తగ్గించేసినట్టేనా!

ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు షాకులు ఇస్తూనే ఉంది సమంత. ఆమధ్య కొత్త సినిమా ప్రకటిస్తుందని ఎదురుచూసిన అందరికీ, తన వెబ్ సిరీస్ ముచ్చట్టు చెప్పింది. ఆ తర్వాత లాక్ డౌన్ పడింది. కనీసం లాక్ డౌన్ లో చిన్న ప్రకటన చేసి వదిలిపెట్టినా బాగుండేది. అలాంటిదేం చేయకుండా టెర్రస్ గార్డెనింగ్, సాకీ బ్రాండింగ్ అంటూ కొత్త పనులు పెట్టుకుంది. ఆమధ్య బిగ్ బాస్ లో యాంకరింగ్ కూడా చేసింది. […]

సమంత ఇక సినిమాలు తగ్గించేసినట్టేనా!
X

ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు షాకులు ఇస్తూనే ఉంది సమంత. ఆమధ్య కొత్త సినిమా ప్రకటిస్తుందని ఎదురుచూసిన అందరికీ, తన వెబ్ సిరీస్ ముచ్చట్టు చెప్పింది. ఆ తర్వాత లాక్ డౌన్ పడింది.

కనీసం లాక్ డౌన్ లో చిన్న ప్రకటన చేసి వదిలిపెట్టినా బాగుండేది. అలాంటిదేం చేయకుండా టెర్రస్ గార్డెనింగ్, సాకీ బ్రాండింగ్ అంటూ కొత్త పనులు పెట్టుకుంది. ఆమధ్య బిగ్ బాస్ లో యాంకరింగ్ కూడా చేసింది.

ఇక లాక్ డౌన్ ముగుస్తోంది. సమంత సెట్స్ పైకి వస్తుందనుకునేలోగా మరో షాక్ ఇచ్చింది శామ్. ఈసారి ఫుల్ లెంగ్త్ యాంకర్ గా అవతారం ఎత్తింది. ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు సెలబ్రిటీలతో చిట్ చాట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. 13వ తేదీ నుంచి అది వరుసగా ప్రసారం అవుతుంది. ఎప్పటికి ఆగుతుందో కూడా తెలీదు. ఎందుకంటే అది చిట్ చాట్ కార్యక్రమం కాబట్టి.

చూస్తుంటే.. సమంతకు ఇప్పట్లో సినిమా స్టార్ట్ చేసే మూడ్ లేనట్టుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన జాను తర్వాత సమంత మళ్లీ ఇంకో సినిమా స్టార్ట్ చేయలేదు.

First Published:  6 Nov 2020 8:45 AM GMT
Next Story