Telugu Global
International

అమెరికా అగ్రరాజ్య హోదా కోల్పోనుందా?

ప్రపంచ పెద్దన్న… వరల్డ్‌ సూపర్‌ పవర్…‌. అగ్రరాజ్యం అంటే గుర్తుకు వచ్చేది అమెరికా. కానీ ఆ హోదా ఇక కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. అమెరికా ఎన్నికల్లో గందరగోళంతో ఇదేమి అగ్రరాజ్యం అనే పరిస్థితికి వచ్చింది. దీంతో పాటు ఆమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా రోజురోజుకు తగ్గుతోంది. మొన్నటివరకు ప్రపంచం అంతా అగ్రరాజ్యం అమెరికా అనేది. కానీ ఇప్పుడు ఆ హోదా పోయే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా దెబ్బో తెలియదు… తప్పుడు నిర్ణయాలో తెలియదు… రాబోయే రోజుల్లో చైనా […]

అమెరికా అగ్రరాజ్య హోదా కోల్పోనుందా?
X

ప్రపంచ పెద్దన్న… వరల్డ్‌ సూపర్‌ పవర్…‌. అగ్రరాజ్యం అంటే గుర్తుకు వచ్చేది అమెరికా. కానీ ఆ హోదా ఇక కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. అమెరికా ఎన్నికల్లో గందరగోళంతో ఇదేమి అగ్రరాజ్యం అనే పరిస్థితికి వచ్చింది. దీంతో పాటు ఆమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా రోజురోజుకు తగ్గుతోంది.

మొన్నటివరకు ప్రపంచం అంతా అగ్రరాజ్యం అమెరికా అనేది. కానీ ఇప్పుడు ఆ హోదా పోయే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా దెబ్బో తెలియదు… తప్పుడు నిర్ణయాలో తెలియదు… రాబోయే రోజుల్లో చైనా పెద్దన్న పాత్ర పోషించబోతోంది.

ఎకానమీ పరంగా చూసుకుంటే అమెరికాకు దెబ్బ పడింది. ప్రస్తుతం చైనా ఎకానమీ 24.2 ట్రిలియన్ డాలర్లు. అమెరికా ఎకానమీ 20.8 ట్రిలియన్ డాలర్లు. అంటే ఆర్ధికపరంగా అమెరికాను డ్రాగన్‌ కంట్రీ దాటేసింది.

ఇప్పుడు బైడెన్‌ గెలుపు వెనుక చైనా పాత్ర ఉందనేది ట్రంప్‌ ఆరోపణ. అన్నట్లుగా చైనా కంపెనీలతో బైడెన్‌ ఒప్పందాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అమెరికాలో కూడా చైనా పెత్తనం పెరుగుతుంది అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. చైనా చెప్పుచేతుల్లోకి అమెరికా వ్యవస్థ వెళుతుందని కొందరి అనుమానం.

బైడెన్‌ కు అనుకూలంగా అమెరికా మీడియాను నడిపించడంలో చైనా పాత్ర ఉందని ట్రంప్‌ మద్దతుదారులు అంటున్నారు. మీడియా, సోషల్‌ మీడియాను ట్రంప్‌కు వ్యతిరేకంగా నడిపించడంలో డ్రాగన్‌ హస్తం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు బైడెన్‌ చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని… దీంతో అమెరికా అగ్రరాజ్యం హోదా పోతుందని అంటున్నారు.

ఇటు దక్షిణాసియాలో కూడా చైనా తన పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది. శ్రీలంకలో పోర్టు పేరుతో సాయం చేసి… అక్కడ పట్టు సాధించింది. పాకిస్తాన్‌కు ఎప్పటినుంచో సాయం చేస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ను రెచ్చగొడుతోంది. మనదేశంతో సరిహద్దుల్లో కాలుదువ్వుతోంది. యూరప్‌లో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. దీంతో అగ్రరాజ్యం అనిపించుకునేందుకు చైనా విసిరిన పాచికలు పారినట్లే కనిపిస్తోంది. త్వరలో ప్రపంచ పెద్దన్నగా చైనా మారే అవకాశం దగ్గర్లోనే ఉందంటున్నారు.

First Published:  6 Nov 2020 8:38 PM GMT
Next Story