Telugu Global
Cinema & Entertainment

హనీమూన్ కు వెళ్లిన కాజల్

పెళ్లయిన వెంటనే కొన్ని రోజులు కొత్తింట్లో కాపురం పెట్టి, ఆ వెంటనే సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ కాజల్ మాత్రం వైవాహిక జీవితాన్ని మిస్ అవ్వదలుచుకోలేదు. ఆమె తన భర్తతో కలిసి హనీమూన్ కు వెళ్లింది. ఈ మేరకు ఆచార్య యూనిట్ తో పాటు తమిళ సినిమా యూనిట్ కు సమాచారం అందించింది. హనీమూన్ తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి ఆమె జాయిన్ అవుతుంది. అయితే కాజల్ హనీమూన్ కు వెళ్లడం […]

హనీమూన్ కు వెళ్లిన కాజల్
X

పెళ్లయిన వెంటనే కొన్ని రోజులు కొత్తింట్లో కాపురం పెట్టి, ఆ వెంటనే సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ కాజల్ మాత్రం వైవాహిక జీవితాన్ని మిస్ అవ్వదలుచుకోలేదు. ఆమె తన భర్తతో కలిసి హనీమూన్ కు వెళ్లింది.

ఈ మేరకు ఆచార్య యూనిట్ తో పాటు తమిళ సినిమా యూనిట్ కు సమాచారం అందించింది. హనీమూన్ తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి ఆమె జాయిన్ అవుతుంది.

అయితే కాజల్ హనీమూన్ కు వెళ్లడం వల్ల సదరు సినిమాలకు కలిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే, అవి ఇంకా సెట్స్ పైకి రాలేదు. వచ్చినా వెంటనే కాజల్ తో అవసరం లేదు. ఈ గ్యాప్ లో హనీమూన్ ముగించుకొని సెట్స్ పైకి వచ్చేస్తుంది కాజల్.

తను హనీమూన్ కు వెళ్లబోతున్న విషయాన్ని కాజల్ స్వయంగా ప్రకటించింది. తన పాస్ పోర్ట్, తన భర్త పాస్ పోర్ట్ ఫొటోల్ని ఆమె షేర్ చేసింది.

First Published:  7 Nov 2020 8:30 AM GMT
Next Story