Telugu Global
Cinema & Entertainment

నిశ్చితార్థం వెనక సీక్రెట్ చెప్పిన బ్యూటీ

తమ సినిమా ప్రమోషన్ కోసం రకరకాలుగా ప్రమోషన్ చేసే నటీనటులున్నారు. అయితే కాస్త దిగజారి తనకు ఎంగేజ్ మెంట్ అయిందంటూ అసత్య ప్రచారం చేసే హీరోయిన్లు మాత్రం చాలా తక్కువ. తాజాగా ఆ లిస్ట్ లోకి చేరింది బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి. తనకు ఎంగేజ్ మెంట్ పూర్తయినట్టు ఈమధ్య ఓ ఫేక్ ఫొటోను పునర్నవి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన వెబ్ సిరీస్ ప్రచారం కోసమే పునర్నవి ఆ పిచ్చి పని చేసిందనే […]

నిశ్చితార్థం వెనక సీక్రెట్ చెప్పిన బ్యూటీ
X

తమ సినిమా ప్రమోషన్ కోసం రకరకాలుగా ప్రమోషన్ చేసే నటీనటులున్నారు. అయితే కాస్త దిగజారి తనకు ఎంగేజ్ మెంట్ అయిందంటూ అసత్య ప్రచారం చేసే హీరోయిన్లు మాత్రం చాలా తక్కువ. తాజాగా ఆ లిస్ట్ లోకి చేరింది బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి. తనకు ఎంగేజ్ మెంట్ పూర్తయినట్టు ఈమధ్య ఓ ఫేక్ ఫొటోను పునర్నవి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే తన వెబ్ సిరీస్ ప్రచారం కోసమే పునర్నవి ఆ పిచ్చి పని చేసిందనే విషయం అదే రోజు తేలిపోయింది. దీంతో ఆమె ప్రచారపు ఎత్తుగడ ఫ్లాప్ అయింది. అయితే తన వెబ్ సిరీస్ ప్రచారం కోసం నిశ్చితార్థం అనే ఫేక్ ప్రమోషన్ ను ఎంచుకోవడం వెనక ఓ కారణం ఉందంటోంది పున్నూ.

ఆమె చేసిన వెబ్ సిరీస్ ఎంగేజ్ మెంట్ తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా తెరకెక్కిందట. అందుకే ఎంగేజ్ మెంట్ అయినట్టు అబద్ధమాడి ప్రచారం ప్రారంభించినట్టు తెలిపింది పునర్నవి. 5 ఎపిసోడ్ల సిరీస్ గా తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ తనకు మంచి పేరు తెస్తుందని చెబుతోంది.

ఆ సిరీస్ మంచి పేరు తెస్తుందో లేదో చెప్పలేం కానీ పునర్నవికి మాత్రం తన పిచ్చి ప్రచారంతో సోషల్ మీడియాలో చెడ్డపేరు వచ్చింది. రేపు ఆమె నిజంగా నిశ్చితార్థం అయినట్టు ప్రకటించినా జనాలు నమ్మరు.

First Published:  7 Nov 2020 4:56 AM GMT
Next Story