Telugu Global
Cinema & Entertainment

అప్పుడే పిల్లలు వద్దు " నాగచైతన్య

తనకు కవల పిల్లలు కావాలంటోంది సమంత. అప్పుడే వద్దంటాడు నాగచైతన్య. ఈ భార్యభర్తల మధ్య ఇప్పుడిలా కొత్త గొడవ మొదలైంది. అయితే ఇదంతా నిజ జీవిత వ్యవహారం కాదు. ఓ యాడ్ లో భాగంగా వీళ్లిద్దరూ ఇలా చిలిపిగా కొట్టుకున్నారు. మింత్రా బ్రాండ్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ, సమంత-నాగచైతన్యలను పెట్టి ఓ యాడ్ క్రియేట్ చేసింది. అందులో ఈ రియల్ లైఫ్ కపుల్.. నాగార్జునకు, అమలకు […]

అప్పుడే పిల్లలు వద్దు  నాగచైతన్య
X

తనకు కవల పిల్లలు కావాలంటోంది సమంత. అప్పుడే వద్దంటాడు నాగచైతన్య. ఈ భార్యభర్తల మధ్య ఇప్పుడిలా కొత్త గొడవ మొదలైంది. అయితే ఇదంతా నిజ జీవిత వ్యవహారం కాదు. ఓ యాడ్ లో భాగంగా వీళ్లిద్దరూ ఇలా చిలిపిగా కొట్టుకున్నారు.

మింత్రా బ్రాండ్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ, సమంత-నాగచైతన్యలను పెట్టి ఓ యాడ్ క్రియేట్ చేసింది. అందులో ఈ రియల్ లైఫ్ కపుల్.. నాగార్జునకు, అమలకు దుస్తులు సెలక్ట్ చేస్తుంటారు. ఇంతలో చిన్న పిల్లల దుస్తులు కూడా యాప్ లో కనిపిస్తాయి.

అప్పుడు నాగచైతన్య-సమంత పిల్లల గురించి పరోక్షంగా మాట్లాడుకుంటారు. సమంత కావాలంటుంది, నాగచైతన్య వద్దంటాడు. ఇలా సరదాగా సాగిపోతోంది యాడ్. వారం రోజులుగా ఇది సోషల్ మీడియాలో, టీవీల్లో హల్ చల్ చేస్తోంది.

First Published:  7 Nov 2020 5:14 AM GMT
Next Story