Telugu Global
Cinema & Entertainment

జెమినీ చేతికి జాతిరత్నాలు

లాక్ డౌన్ టైమ్ లో చిన్నాచితకా సినిమాలు వచ్చేశాయి. ఆర్థిక భారం తట్టుకోలేక దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ కూడా తను నిర్మించిన V సినిమాను ఓటీటీకి ఇచ్చేశాడు. అటు నిశ్శబ్దం లాంటి సినిమా కూడా ఓటీటీకి వచ్చేసింది. కానీ ఇంత హంగామా మధ్య జాతిరత్నాలు అనే చిన్న సినిమా మాత్రం ఓటీటీకి రాలేదు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన ఈ కామెడీ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించింది స్వప్న సినిమాస్ […]

జెమినీ చేతికి జాతిరత్నాలు
X

లాక్ డౌన్ టైమ్ లో చిన్నాచితకా సినిమాలు వచ్చేశాయి. ఆర్థిక భారం తట్టుకోలేక దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ కూడా తను నిర్మించిన V సినిమాను ఓటీటీకి ఇచ్చేశాడు. అటు నిశ్శబ్దం లాంటి సినిమా కూడా ఓటీటీకి వచ్చేసింది. కానీ ఇంత హంగామా మధ్య జాతిరత్నాలు అనే చిన్న సినిమా మాత్రం ఓటీటీకి రాలేదు.

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన ఈ కామెడీ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించింది స్వప్న సినిమాస్ సంస్థ. దీనికి ఓ కారణం ఉంది.

అనుదీప్ డైరక్ట్ చేసిన జాతిరత్నాలు సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు మేకర్స్. అటుఇటుగా 5 కోట్ల రూపాయల బడ్జెట్ లో సినిమా పూర్తయింది. అంతేమొత్తం, వీళ్లకు శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చేసింది. జెమినీ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. దీంతో ఓటీటీకి ఇవ్వాల్సిన అవసరం నిర్మాతలకు రాలేదు. అందుకే ఎంత లేట్ అయినా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

కుదిరితే డిసెంబర్ లో జాతిరత్నాలు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ కరోనా పరిస్థితుల వల్ల అది సాధ్యం కాకపోతే..ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

First Published:  8 Nov 2020 12:00 AM GMT
Next Story