Telugu Global
Cinema & Entertainment

ఒక్క ఫైట్ కోసం 2 కోట్లు ఖర్చు

ఒక్క పైట్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది అసాధారణ విషయమేం కాదు. ఇంతకుముందు కొన్ని సినిమాలకు ఇలానే కోట్లలో ఖర్చుపెట్టి మరీ ఫైట్స్ తీసిన సందర్భాలున్నాయి. అయితే ప్రేమకథ తో తెరకెక్కుతున్న సినిమా కోసం ఇంత ఖర్చు చేయడం అనేది మాత్రం కాస్త విడ్డూరమే. రాధేశ్యామ్ మూవీ మేటర్ ఇది. పక్కా ప్రేమకథగా రాధేశ్యామ్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో యాక్షన్ కు తావులేదు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించి కేవలం […]

ఒక్క ఫైట్ కోసం 2 కోట్లు ఖర్చు
X

ఒక్క పైట్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది అసాధారణ విషయమేం కాదు. ఇంతకుముందు కొన్ని సినిమాలకు ఇలానే కోట్లలో ఖర్చుపెట్టి మరీ ఫైట్స్ తీసిన సందర్భాలున్నాయి. అయితే ప్రేమకథ తో తెరకెక్కుతున్న సినిమా కోసం ఇంత ఖర్చు చేయడం అనేది మాత్రం కాస్త విడ్డూరమే. రాధేశ్యామ్ మూవీ మేటర్ ఇది.

పక్కా ప్రేమకథగా రాధేశ్యామ్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో యాక్షన్ కు తావులేదు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించి కేవలం ఒకే ఒక్క యాక్షన్ బ్లాక్ ఉంది. ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఖర్చుచేయడానికి రెడీ అవుతున్నారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు.

ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించబోతున్నారు. గతంలో గ్లాడియేటర్, బార్న్ ఐడెంటిటీ, లాస్ట్ సమురాయ్ లాంటి యాక్షన్ సినిమాలకు పావెల్, యాక్షన్ డైరక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు రాధేశ్యామ్ కు వర్క్ చేయబోతున్నాడు.

ఇంతకుమందు ప్రభాస్ నటించిన సాహో సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం అచ్చంగా 70 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది యూవీ క్రియేషన్స్. ఇప్పుడిదే సంస్థ, రాధేశ్యామ్ లో యాక్షన్ సీన్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది.

First Published:  8 Nov 2020 5:00 AM GMT
Next Story