Telugu Global
Cinema & Entertainment

సాయితేజ్ సినిమా టైటిల్ ఇదే

లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన వెంటనే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పూర్తిచేశాడు హీరో సాయితేజ్. ఆ వెంటనే దేవకట్టా దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇప్పుడీ మూవీకి టైటిల్ లాక్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్ తో సినిమాను పూర్తిచేస్తున్నారు. అందరి ఆమోదం లభించిన తర్వాత ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ […]

సాయితేజ్ సినిమా టైటిల్ ఇదే
X

లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన వెంటనే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పూర్తిచేశాడు హీరో సాయితేజ్. ఆ వెంటనే దేవకట్టా దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇప్పుడీ మూవీకి టైటిల్ లాక్ చేశారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్ తో సినిమాను పూర్తిచేస్తున్నారు. అందరి ఆమోదం లభించిన తర్వాత ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనేది ప్లాన్.

కాస్త పొలిటికల్ టచ్ ఉన్న కథతో ఈ సినిమా రాబోతోంది. ఇందులో రమ్యకృష్ణ, సీరియస్ పొలిటీషియన్ గా కనిపించబోతోంది. అందుకే కథకు తగ్గట్టు ఈ మూవీకి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ మార్పు గురించి తెలిసిందే. ముందుగా నివేత పెతురాజ్ ను అనుకున్నారు. ఆఖరి నిమిషంలో ఆమెను తప్పించి, ఆ స్థానంలో ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారు. సాయితేజ్-ఐశ్వర్యరాజేష్ మధ్య ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. భగవాన్, పుల్లారావు ఈ సినిమాకు నిర్మాతలు.

First Published:  8 Nov 2020 3:00 AM GMT
Next Story