Telugu Global
Cinema & Entertainment

ఈసారి హారర్ మూవీలో...

క్రేజ్ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అంటోంది శ్రద్ధా శ్రీనాధ్. అందుకే ఆచితూచి కథలు ఎంచుకుంటోంది. ఇందులో భాగంగా కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ హారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రద్ధశ్రీనాధ్. ఇప్పటికే ఎన్నో హారర్ సినిమాలు వచ్చినప్పటికీ.. ఇది వాటన్నింటికంటే ఎంతో భిన్నంగా ఉంటుందని చెబుతోంది. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కలియుగం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ […]

ఈసారి హారర్ మూవీలో...
X

క్రేజ్ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అంటోంది శ్రద్ధా శ్రీనాధ్. అందుకే ఆచితూచి కథలు ఎంచుకుంటోంది. ఇందులో భాగంగా కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ హారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రద్ధశ్రీనాధ్. ఇప్పటికే ఎన్నో హారర్ సినిమాలు వచ్చినప్పటికీ.. ఇది వాటన్నింటికంటే ఎంతో భిన్నంగా ఉంటుందని చెబుతోంది.

తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కలియుగం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇదొక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ.

2021 జనవరి లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. “ఆర్ కె ఇంటెర్నేషనల్” బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

First Published:  8 Nov 2020 8:00 AM GMT
Next Story