Telugu Global
Cinema & Entertainment

బన్నీ-త్రివిక్రమ్ మళ్లీ కలిశారు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. రీసెంట్ గా వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా పెద్ద హిట్టయింది. బాహుబలి-2 తర్వాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఇలా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ జోడీ ఇప్పుడు మరోసారి కలిసింది. అయితే ఈసారి బన్నీ-త్రివిక్రమ్ కలిసి సినిమా చేయడం లేదు. ఓ యాడ్ కోసం పని చేయబోతున్నారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్, ఆహా అనే ఓటీటీ యాప్ ను మెయింటైన్ […]

బన్నీ-త్రివిక్రమ్ మళ్లీ కలిశారు
X

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. రీసెంట్ గా వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా పెద్ద హిట్టయింది. బాహుబలి-2 తర్వాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ ఇదే.

ఇలా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ జోడీ ఇప్పుడు మరోసారి కలిసింది. అయితే ఈసారి బన్నీ-త్రివిక్రమ్ కలిసి సినిమా చేయడం లేదు. ఓ యాడ్ కోసం పని చేయబోతున్నారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్, ఆహా అనే ఓటీటీ యాప్ ను మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మేజర్ పార్టనర్ అతడే. ఇప్పుడీ ఓటీటీ యాప్ కోసం డిఫరెంట్ గా కొన్ని యాడ్స్ చేయబోతున్నారు. ఈ ప్రకటనలకు హీరోగా బన్నీని, దర్శకుడిగా త్రివిక్రమ్ ను తీసుకున్నారు.

సూపర్ హిట్ సినిమాలు తీయడంలోనే కాదు, అద్భుతంగా యాడ్స్ రూపొందించడంలో కూడా త్రివిక్రమ్ కు మంచి పట్టుంది. మహేష్ తో అతడు తీసిన అభి బస్ యాడ్స్ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీతో ఆహా కోసం 4-5 రకాల యాడ్స్ రూపొందించే పనిలో పడ్డాడు త్రివిక్రమ్.

First Published:  8 Nov 2020 1:00 AM GMT
Next Story