Telugu Global
Cinema & Entertainment

మాల్దీవుల్లో తేలిన కాజల్ జంట

కాజల్, గౌతమ్ దంపతులు మాల్దీవుల్లో తేలారు. పెళ్లి తర్వాత నేరుగా సినిమా సెట్స్ పైకి వస్తుందనుకున్న కాజల్, భర్తతో కలిసి హనీమూన్ ప్లాన్ చేసింది. సడెన్ గా మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం మాల్దీవుల్లోని అత్యంత ఖరీదైన రిసార్ట్ లో ఈ జంట సేదతీరుతోంది. నిజానికి కాజల్ లిస్ట్ లో హనీమూన్ ప్లాన్స్ లేవు. ఆమె వెంటనే ఓ తమిళ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆచార్య సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి […]

మాల్దీవుల్లో తేలిన కాజల్ జంట
X

కాజల్, గౌతమ్ దంపతులు మాల్దీవుల్లో తేలారు. పెళ్లి తర్వాత నేరుగా సినిమా సెట్స్ పైకి వస్తుందనుకున్న కాజల్, భర్తతో కలిసి హనీమూన్ ప్లాన్ చేసింది. సడెన్ గా మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం మాల్దీవుల్లోని అత్యంత ఖరీదైన రిసార్ట్ లో ఈ జంట సేదతీరుతోంది.

నిజానికి కాజల్ లిస్ట్ లో హనీమూన్ ప్లాన్స్ లేవు. ఆమె వెంటనే ఓ తమిళ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆచార్య సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది. కానీ తమిళ సినిమా యూనిట్ అందుకు ఒప్పుకోలేదు. వైవాహిక జీవితాన్ని కొన్నాళ్లు ఎంజాయ్ చేసిన తర్వాత షెడ్యూల్ ఫిక్స్ చేస్తామని హామీ ఇచ్చింది.

ఇటు ఆచార్య యూనిట్ కూడా కాజల్ కు షూటింగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆమెతో సంబంధం లేని సన్నివేశాల్ని షెడ్యూల్ వేసుకుంది. దీనికితోడు చిరంజీవికి కరోనా సోకడంతో ఆచార్య షూటింగ్ మరోసారి వాయిదాపడింది. అటు ఇండియన్-2 షూటింగ్ కు కూడా చాలా టైమ్ ఉంది.

సో.. ఇప్పట్లో కాజల్ కు షూటింగ్స్ లేనట్టే. కావాలనుకుంటే ఆమె తన భర్తతో కలిసి మాల్దీవుల నుంచి మరో దేశం కూడా చుట్టిరావొచ్చు.

https://www.instagram.com/p/CHU8csSnuzL/

First Published:  9 Nov 2020 7:39 AM GMT
Next Story