Telugu Global
Cinema & Entertainment

ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పూజా హెగ్డే

ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది పూజా హెగ్డే. ఓ హిందీ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తెలుగు మేకర్స్ అంతా నడుము అంటే పడి చచ్చిపోతారనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లంతా పూజాహెగ్డేపై భగ్గుమన్నారు. తనపై గంటగంటకు పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన పూజా హెగ్డే, వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. తను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. “నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటల్ని వేరే సందర్భానికి […]

ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పూజా హెగ్డే
X

ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది పూజా హెగ్డే. ఓ హిందీ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తెలుగు మేకర్స్ అంతా నడుము అంటే పడి చచ్చిపోతారనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లంతా పూజాహెగ్డేపై భగ్గుమన్నారు. తనపై గంటగంటకు పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన పూజా హెగ్డే, వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. తను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

“నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటల్ని వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరు కానీ అభిమానాన్ని మార్చలేరు. నాకు ఎప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రాణసమానం. ఇది నా చిత్రాల్ని అభిమానించేవారికి, అభిమానులకు తెలిసినా, ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో నేను మళ్లీ చెబుతున్నాను. నాకు ఎంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను.”

ఇలా తనపై చెలరేగిన వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది పూజాహెగ్డే. అయితే ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలు వక్రీకరించడానికేం లేదు. ఆమె స్పష్టంగా చెప్పింది. తన నాభి అందాల్ని చూపించే కంటే, తన సెక్సీ లెగ్స్ ను చూపించమని మేకర్స్ కు చెబుతానని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది.

First Published:  9 Nov 2020 9:32 AM GMT
Next Story