Telugu Global
Cinema & Entertainment

తమన్నకు అలా కరోనా సోకింది

ఈమధ్య తమన్నకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆమె వెంటనే హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయింది. కొన్నాళ్ల తర్వాత డిశ్చార్జ్ అయి, హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ముంబయిలోని తన ఇంటికి వెళ్లి ఇంకొన్ని రోజులు రిలాక్స్ అయింది. అంతా బాగానే ఉంది కానీ, తమన్నకు ఎక్కడ కరోనా సోకిందనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఎఁదుకంటే ఆమె షూటింగ్స్ చేయలేదు. గుర్తుందా శీతాకాలం అనే మూవీ జస్ట్ ఓపెనింగ్ […]

తమన్నకు అలా కరోనా సోకింది
X

ఈమధ్య తమన్నకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆమె వెంటనే హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయింది. కొన్నాళ్ల తర్వాత డిశ్చార్జ్ అయి, హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ముంబయిలోని తన ఇంటికి వెళ్లి ఇంకొన్ని రోజులు రిలాక్స్ అయింది.

అంతా బాగానే ఉంది కానీ, తమన్నకు ఎక్కడ కరోనా సోకిందనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఎఁదుకంటే ఆమె షూటింగ్స్ చేయలేదు. గుర్తుందా శీతాకాలం అనే మూవీ జస్ట్ ఓపెనింగ్ మాత్రమే అయింది. సీటీమార్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. మరి తమన్నకు ఎలా కరోనా సోకింది. ఎట్టకేలకు ఆ మేటర్ ఇప్పుడు బయటపడింది.

లాక్ డౌన్ టైమ్ లో ఆమె ఓ వెబ్ సిరీస్ చేసింది. అది కూడా రాత్రిపూట షూటింగ్. ఆహా ఓటీటీలో లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తోంది. ఆ సెట్స్ లోనే తనకు కరోనా సోకిన విషయాన్ని సమంత బయటపెట్టింది. ఆ టైమ్ లో వెబ్ సిరీస్ నిర్మాత తనను బాగా చూసుకున్నాడని కూడా చెప్పుకొచ్చింది మిల్కీబ్యూటీ.

First Published:  9 Nov 2020 7:37 AM GMT
Next Story