Telugu Global
National

ట్రంప్‌కు మెలానియా విడాకులు... పదవితో పాటు మరో షాక్‌ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కు‌ మరో షాక్‌ తగలబోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైట్‌హౌస్‌ వర్గాలు. ట్రంప్‌ మూడో భార్య మెలానియా విడాకులు ఇవ్వబోతుందట. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమితో ట్రంప్‌ ఢీలాపడ్డారు. ఇటు పదవి పోయింది. అటు భార్య కూడా విడాకులు ఇవ్వబోతోందట. ట్రంప్‌ డబుల్‌ ధమాకా తగలబోతుందని ప్రచారం జరుగుతోంది. ట్రంప్‌ స్లోవేయిన్-అమెరికన్ మోడల్ మెలానియాను 2005లో మూడో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల […]

ట్రంప్‌కు మెలానియా విడాకులు... పదవితో పాటు మరో షాక్‌ !
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కు‌ మరో షాక్‌ తగలబోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైట్‌హౌస్‌ వర్గాలు. ట్రంప్‌ మూడో భార్య మెలానియా విడాకులు ఇవ్వబోతుందట. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమితో ట్రంప్‌ ఢీలాపడ్డారు. ఇటు పదవి పోయింది. అటు భార్య కూడా విడాకులు ఇవ్వబోతోందట. ట్రంప్‌ డబుల్‌ ధమాకా తగలబోతుందని ప్రచారం జరుగుతోంది.

ట్రంప్‌ స్లోవేయిన్-అమెరికన్ మోడల్ మెలానియాను 2005లో మూడో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె విడాకులు ఇవ్వబోతుందని డైలీ మెయిల్‌ ఓ స్టోరీ ప్రచురించింది. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత మెలానియా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. మెలానియాకు సన్నిహితంగా ఉండే వారు ఈవిషయాన్ని చెబుతున్నారు.

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కావడం మెలానియాకు ఇష్టం లేదని తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో ట్రంప్‌ గెలుస్తాడని అనుకోలేదట. అందుకే అప్పుడు వైట్‌హౌజ్‌కి రాలేదట. కొడుకు చదువు కోసం ప్లోరిడాలోనే ఉండిపోయిందట. ఆతర్వాత ట్రంప్‌ కోరడంతోనే వైట్‌హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చిందట. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమితో వారి వైవాహిక జీవితానికి ఎండ్‌ కార్డు పడబోతుందట.

First Published:  8 Nov 2020 9:25 PM GMT
Next Story