Telugu Global
Cinema & Entertainment

నాగార్జునకు నెగెటివ్

హీరో చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అంతకంటే కొన్ని రోజుల ముందు చిరంజీవి, నాగార్జున కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. దీంతో నాగార్జునకు కూడా కరోనా సోకి ఉంటుందని చాలామంది అనుమానించారు. అయితే నాగార్జున సేఫ్. చిరంజీవికి కరోనా అని తెలిసిన వెంటనే నాగార్జున కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఆ రిజల్ట్  వచ్చింది. పరీక్షల్లో నాగార్జునకు నెగెటివ్ అనే తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టెస్టుల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ ముందు […]

నాగార్జునకు నెగెటివ్
X

హీరో చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అంతకంటే కొన్ని రోజుల ముందు చిరంజీవి, నాగార్జున కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. దీంతో నాగార్జునకు కూడా కరోనా సోకి ఉంటుందని చాలామంది అనుమానించారు. అయితే నాగార్జున సేఫ్.

చిరంజీవికి కరోనా అని తెలిసిన వెంటనే నాగార్జున కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఆ రిజల్ట్ వచ్చింది. పరీక్షల్లో నాగార్జునకు నెగెటివ్ అనే తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

టెస్టుల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ ముందు జాగ్రత్తగా నాగార్జున హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆయన నటించాల్సిన బ్రహ్మాస్త్ర సినిమా పోస్ట్ పోన్ అయింది. మరో 2 రోజులు ఐసొలేషన్ లో ఉండి, ఆ తర్వాత బిగ్ బాస్ షూట్ లో జాయిన్ అవుతాడు నాగ్.

First Published:  11 Nov 2020 11:32 AM GMT
Next Story