Telugu Global
Cinema & Entertainment

రష్మిక కూడా ల్యాండ్ అయింది

ఇవాళ్టి నుంచి పుష్ప సినిమా స్టార్ట్ అయింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఫైట్ సీక్వెన్స్ తో ఈ షూట్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బన్నీపై ఫైట్ సీన్ షూట్ స్టార్ట్ చేశారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం వందల సంఖ్యలో భారీ దుంగల్ని లొకేషన్ కు తీసుకొచ్చారు. పాడుపడిన జీపులు, బస్సుల్ని కూడా సెట్ లో భాగంగా ఏర్పాటుచేశారు. మరో 4 రోజుల పాటు ఈ […]

రష్మిక కూడా ల్యాండ్ అయింది
X

ఇవాళ్టి నుంచి పుష్ప సినిమా స్టార్ట్ అయింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఫైట్ సీక్వెన్స్ తో ఈ షూట్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బన్నీపై ఫైట్ సీన్ షూట్ స్టార్ట్ చేశారు.

ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం వందల సంఖ్యలో భారీ దుంగల్ని లొకేషన్ కు తీసుకొచ్చారు. పాడుపడిన జీపులు, బస్సుల్ని కూడా సెట్ లో భాగంగా ఏర్పాటుచేశారు. మరో 4 రోజుల పాటు ఈ ఫైట్ షూటింగ్ జరుగుతుంది. అంతలోనే ఈ లొకేషన్ లోకి రష్మిక ఎంటరైంది.

ఈరోజు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి చేరుకుంది రష్మిక. రేపట్నుంచి ఆమె సెట్స్ పైకి వస్తుంది. చూస్తుంటే.. ప్రస్తుతం జరుగుతున్న ఫైట్ సీక్వెన్స్ లో రష్మిక కూడా కనిపించే అవకాశం ఉంది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మారేడుమిల్లిలో దాదాపు నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. కాబట్టి రష్మిక-బన్నీ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు.

First Published:  10 Nov 2020 1:14 PM GMT
Next Story