Telugu Global
Cinema & Entertainment

'వకీల్ సాబ్'తో శ్రీముఖి ఫొటో పై క్లారిటీ....

ఉన్నట్టుండి సడెన్ గా పవన్ కల్యాణ్ తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది శ్రీముఖి. దీంతో అంతా, ‘వకీల్ సాబ్’లో శ్రీముఖి కూడా ఉందనుకున్నారు. 2 రోజులుగా చక్కర్లు కొడుతున్న ఈ రూమర్ పై శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది. ”వకీల్ సాబ్”తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది రాములమ్మ. తను షూట్ చేస్తున్న సెట్ పక్కనే, వకీల్ సాబ్ షూట్ కూడా జరుగుతోందని, వెళ్లి చూసొద్దామని జానీ మాస్టర్ అనడంతో, ఇద్దరం కలిసి వెళ్లామంటోంది శ్రీముఖి. […]

వకీల్ సాబ్తో శ్రీముఖి ఫొటో పై క్లారిటీ....
X

ఉన్నట్టుండి సడెన్ గా పవన్ కల్యాణ్ తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది శ్రీముఖి. దీంతో అంతా, ‘వకీల్ సాబ్’లో శ్రీముఖి కూడా ఉందనుకున్నారు. 2 రోజులుగా చక్కర్లు కొడుతున్న ఈ రూమర్ పై శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది.

”వకీల్ సాబ్”తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది రాములమ్మ. తను షూట్ చేస్తున్న సెట్ పక్కనే, వకీల్ సాబ్ షూట్ కూడా జరుగుతోందని, వెళ్లి చూసొద్దామని జానీ మాస్టర్ అనడంతో, ఇద్దరం కలిసి వెళ్లామంటోంది శ్రీముఖి.

సెట్స్ లో పవన్ కల్యాణ్ ఉంటే ఆ వాతావరణం, ఆరా మొత్తం నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని చెబుతోంది శ్రీముఖి. అలా పవన్ కల్యాణ్ ను కలిసి ఆయనతో సెల్ఫీ దిగే అదృష్టం తనకు దక్కిందని అంటోంది.

First Published:  11 Nov 2020 12:43 AM GMT
Next Story