Telugu Global
National

బీహార్‌లో ఎల్జేపీ దెబ్బ... లాలూ కొడుక్కి అధికారం దూరం !

బీహార్‌ ఫలితం అర్ధరాత్రి వరకు ఉత్కంఠ రేపింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెలిచింది. మొత్తం 243 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ని దాటేసి 125 స్థానాల్లో విజయం సాధించింది. తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలు గెలిచి గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్జేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఆర్జేడీ అత్యధికంగా […]

బీహార్‌లో ఎల్జేపీ దెబ్బ... లాలూ కొడుక్కి అధికారం దూరం !
X

బీహార్‌ ఫలితం అర్ధరాత్రి వరకు ఉత్కంఠ రేపింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెలిచింది. మొత్తం 243 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ని దాటేసి 125 స్థానాల్లో విజయం సాధించింది. తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలు గెలిచి గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్జేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది.

ఆర్జేడీ అత్యధికంగా 75 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 74 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల వారీగా చూస్తే.. అధికార ఎన్డీయేలో.. బీజేపీ 74, జేడీయూ 43, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ 4, హెచ్‌ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 75, కాంగ్రెస్‌ 19, లెఫ్ట్‌ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్‌ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. మహాదళితులకు ఎస్సీల్లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో వారు నితీష్‌ వెన్నంటి నిలిచారు.

పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జన్‌శక్తి పార్టీకి వచ్చింది ఒకే ఒక్క సీటు. వచ్చిన ఓట్ల శాతం 5.66 శాతం. కానీ చిరాగ్‌ పాశ్వాన్‌ భారీగా ఓట్లను చీల్చారు. ఎన్టీయేను అధికారంలోకి తీసుకొచ్చారు. కూటమితో కలిసి పోటీ చేస్తే దెబ్బ పడేది. అందుకే విడిగా పోటీ చేయించారు. ఆర్జేడీ కూటమి ఓట్లను చీల్చారు.

మహాకూటమి అధికారానికి దూరం కావడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి… కాంగ్రెస్ బలంగా లేకపోయినా, సరైన అభ్యర్ధులు లేకపోయినా ఎక్కువ సీట్లను తీసుకోవడం. రెండవది… లోక్ జనశక్తి పార్టీ విడిగా పోటీచేసి మహాకూటమికి పడాల్సిన దళితుల ఓట్లను చీల్చడం. మూడవది… మహాకూటమికి పడాల్సిన ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చడం… ఈ మూడు కారణాలు ప్రధానంగా తేజస్వీ యాదవ్ ను ముఖ్యమంత్రి పీఠానికి దూరం చేశాయి.

First Published:  10 Nov 2020 9:24 PM GMT
Next Story