Telugu Global
Cinema & Entertainment

మొదటి రోజే మొదలుపెట్టాడుగా

పుష్ప సినిమా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈపాటికి షూటింగ్ మొత్తం పూర్తికావాల్సిన ఈ మూవీ, ఇప్పుడు సెకెండ్ షెడ్యూల్ లోకి మాత్రమే ఎంటరైంది. ఇంకా చెప్పాలంటే సినిమా 20శాతం మాత్రమే కంప్లీట్ అయింది. ఇలాంటి టైమ్ లో యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పుష్ప సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్ కూడా సమాంతరంగా చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ప్రాజెక్టు బాగా ఆలస్యమవ్వడంతో, ఒకేసారి ప్రచారం కూడా స్టార్ట్ చేసి, మంచి టైమ్ చూసి […]

మొదటి రోజే మొదలుపెట్టాడుగా
X

పుష్ప సినిమా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈపాటికి షూటింగ్ మొత్తం పూర్తికావాల్సిన ఈ మూవీ, ఇప్పుడు సెకెండ్ షెడ్యూల్ లోకి మాత్రమే ఎంటరైంది. ఇంకా చెప్పాలంటే సినిమా 20శాతం మాత్రమే కంప్లీట్ అయింది. ఇలాంటి టైమ్ లో యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై పుష్ప సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్ కూడా సమాంతరంగా చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ప్రాజెక్టు బాగా ఆలస్యమవ్వడంతో, ఒకేసారి ప్రచారం కూడా స్టార్ట్ చేసి, మంచి టైమ్ చూసి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి షెడ్యూల్ నుంచి బన్నీ ఆన్-లొకేషన్ స్టిల్ ను రిలీజ్ చేశారు.

మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. కావాలంటే టీజర్ లేదా మరో లుక్ రిలీజ్ వరకు వెయిట్ చేయొచ్చు. కానీ పుష్ప యూనిట్ మాత్రం ప్లాన్ మార్చింది. షూటింగ్ తో పాటే ప్రమోషన్ అనే కొత్త కోణాన్ని ఎంచుకుంది. అందులో భాగంగానే ఈ స్టిల్ రిలీజైంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరుగుతోంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక కూడా పాల్గొంటోంది. సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టుకు దేవిశ్రీ సంగీత దర్శకుడు.

First Published:  12 Nov 2020 7:47 AM GMT
Next Story