Telugu Global
Cinema & Entertainment

అవికా గౌర్ బాయ్ ఫ్రెండ్ ఇతడే

టాలీవుడ్ లో సినిమాలు తగ్గించిన అవికా గౌర్ తన ప్రియుడ్ని జనాలకు పరిచయం చేసింది. దాదాపు నాలుగేళ్లుగా తనకు దగ్గరైన మిలింద్ చద్వానీని ప్రేమిస్తున్న విషయాన్ని బయటపెట్టింది. ఈ మేరకు మిలింద్ తో కలిసి దిగిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేసింది. మిలింద్ హీరో కాదు. కొన్ని రియాలిటీ షోల్లో పాల్గొన్న వ్యక్తి. ప్రస్తుతం ఓ స్వచ్ఛంధ సంస్థను నడిపిస్తున్నాడు. అతడికి ఫ్యామిలీ బిజినెస్ లు చాలానే ఉన్నాయి. అతడితో తన జీవితం చాలా సుఖంగా ఉంటుందని […]

అవికా గౌర్ బాయ్ ఫ్రెండ్ ఇతడే
X

టాలీవుడ్ లో సినిమాలు తగ్గించిన అవికా గౌర్ తన ప్రియుడ్ని జనాలకు పరిచయం చేసింది. దాదాపు నాలుగేళ్లుగా తనకు దగ్గరైన మిలింద్ చద్వానీని ప్రేమిస్తున్న విషయాన్ని బయటపెట్టింది. ఈ మేరకు మిలింద్ తో కలిసి దిగిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేసింది.

మిలింద్ హీరో కాదు. కొన్ని రియాలిటీ షోల్లో పాల్గొన్న వ్యక్తి. ప్రస్తుతం ఓ స్వచ్ఛంధ సంస్థను నడిపిస్తున్నాడు. అతడికి ఫ్యామిలీ బిజినెస్ లు చాలానే ఉన్నాయి. అతడితో తన జీవితం చాలా సుఖంగా ఉంటుందని అభిప్రాయపడింది అవిక.

రీసెంట్ గా రాజుగారి గది3 సినిమా చేసింది ఈ చిన్నది. తెలుగులో తను కావాలనే సినిమాలు తగ్గిస్తున్నానని ఓపెన్ గా ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ.. హిందీలో సీరియల్స్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. ఈమధ్య స్లిమ్ గా మారి మరింత ఎట్రాక్ట్ చేస్తోంది.

ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ… మరాఠీ చిత్ర పరిశ్రమ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని స్పష్టంచేసింది. మిలింద్, తను ఇలా ప్రేమించుకుంటూనే ఉంటామని, తమ పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని చెబుతోంది

First Published:  12 Nov 2020 7:44 AM GMT
Next Story