Telugu Global
International

అమెరికాలో కీలక బాధ్యతల్లో...  మరో తమిళమూలాలున్న మహిళ  !

తమిళనాడు మూలాలున్న కమలా హ్యారిస్… అమెరికా ఉపాధ్యక్షురాలవటం పట్ల తమిళనాడు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వారికి మరింత ఆనందాన్ని కలిగిస్తూ… తమిళనాడు మూలాలున్న మరొక మహిళ డాక్టర్ సెలిన్ గౌండర్… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి కోవిడ్ 19 నివారణ సలహా దారుల్లో ఒకరిగా నియమితులయ్యారు. సెలిన్ తండ్రి పేరు రాజ్ నటరాజన్ గౌండర్. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా…. మోదాకురిచి తాలూకాలోని పెరుమాపాళ్యం అనే ఓ చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన. 1968లో […]

అమెరికాలో కీలక బాధ్యతల్లో...  మరో తమిళమూలాలున్న మహిళ  !
X

తమిళనాడు మూలాలున్న కమలా హ్యారిస్… అమెరికా ఉపాధ్యక్షురాలవటం పట్ల తమిళనాడు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వారికి మరింత ఆనందాన్ని కలిగిస్తూ… తమిళనాడు మూలాలున్న మరొక మహిళ డాక్టర్ సెలిన్ గౌండర్… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి కోవిడ్ 19 నివారణ సలహా దారుల్లో ఒకరిగా నియమితులయ్యారు. సెలిన్ తండ్రి పేరు రాజ్ నటరాజన్ గౌండర్. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా…. మోదాకురిచి తాలూకాలోని పెరుమాపాళ్యం అనే ఓ చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన. 1968లో అమెరికాకు వలస వెళ్లారు.

సెలిన్… అమెరికా అధ్యక్షుని కోవిడ్ 19 సలహాదారుల్లో ఒకరిగా నియమితులయ్యారని తెలియటంతో ఈ ప్రాంత వాసులందరూ చాలా సంతోషంలో ఉన్నారు. సెలిన్ కుటుంబానికి సన్నిహిత బంధువైన ఎస్ తంగవేల్… రాజ్ నటరాజన్ గౌండర్ అమెరికా వలస వెళ్లిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

తిరుచునాపల్లిలోని సెంట్ జోసెఫ్ కాలేజిలో గ్రాడ్యుయేషన్, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అనంతరం నటరాజన్ 1968లో అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న సెలిన్… అమెరికాలోనే జన్మించింది. అయితే ఆమె అమెరికాలోనే పుట్టి పెరిగినా… తన తండ్రి సొంత ఊరితో అనుబంధాన్ని నిలుపుకుంటూనే వస్తున్నారు.

తన తండ్రి చదువుకున్న మోదాకురిచి బాయ్స్ సెకండరీ హయ్యర్ స్కూల్ కి ఆర్థికంగా అండగా నిలిచారామె. ఈ స్కూలుని రాష్ట్రప్రభుత్వం నడుపుతోంది. అలాగే పేద ప్రజలకు సహాయం అందించేందుకు రాజ్ గౌండర్ ఫౌండేషన్ నెలకొల్పారు. సెలిన్ తనకు వీలున్నప్పుడల్లా పెరుమాపాళ్యం వస్తుంటారు. ఇక్కడి స్కూలుకి ఆధునిక వసతులను సమకూర్చడంతో పాటు… పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లేందుకు స్కాలర్ షిప్ లను సైతం అందిస్తున్నారు.

గ్రామంలోని అంగవైకల్యం ఉన్న చిన్నారులకు సైతం ఆమె ఆర్థిక సహాయం చేశారు. సెలిన్ తన తండ్రి పుట్టిపెరిగిన ఊరి పట్ల చూపుతున్న ఆదరణను గుర్తు చేసుకుని ఈ ప్రాంత వాసులు, ఆమె బంధువులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలిన్ తల్లిపేరు నికోల్. ఆమె ఫ్రాన్స్ కి చెందిన మహిళ. రాజ్, నికోల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా… సెలిన్ మొదటి సంతానం.

తమిళమూలాలున్న సెలిన్ గౌండర్ అమెరికా అధ్యక్షుని నేషనల్ ప్యాండమిక్ టాస్క్ ఫోర్సుకి ఎంపిక కావటం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి సైతం తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. సెలిన్ తన ట్విటర్లో తమిళనాడు ప్రస్తావన తెచ్చారు. భారతదేశంతో పాటు తమిళనాడులోని తనవాళ్లు… తనకు దక్కిన ఈ అవకాశం పట్ల గర్వంగా ఉన్నారన్నారామె. సెలిన్… న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన గ్రాస్ మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో… మెడిసిన్ అండ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ విభాగంలో క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. హెచ్ఐవి, ఇతర ఇన్ ఫెక్షన్ వ్యాధుల స్పెషలిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారామె.

First Published:  12 Nov 2020 6:10 AM GMT
Next Story