Telugu Global
Cinema & Entertainment

బెల్లంకొండ బాలీవుడ్ కలలు

టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. హిట్స్ తక్కువ, ఫ్లాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ తో నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడీ హీరో కొత్త ప్లాన్ వేశాడు. ఏకంగా బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి పావులు కదుపుతున్నాడు. అవును.. త్వరలోనే తన బాలీవుడ్ ప్రాజెక్టును ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ. ఈమధ్య కాలంలో వరుసగా ఫొటోషూట్లు రిలీజ్ చేసింది కూడా అందుకే అంటున్నారు చాలామందది. ఇంతకీ బెల్లంకొండ చేయబోయే బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా? తెలుగులో […]

బెల్లంకొండ బాలీవుడ్ కలలు
X

టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. హిట్స్ తక్కువ, ఫ్లాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ తో నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడీ హీరో కొత్త ప్లాన్ వేశాడు. ఏకంగా బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి పావులు కదుపుతున్నాడు.

అవును.. త్వరలోనే తన బాలీవుడ్ ప్రాజెక్టును ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ. ఈమధ్య కాలంలో వరుసగా ఫొటోషూట్లు రిలీజ్ చేసింది కూడా అందుకే అంటున్నారు చాలామందది. ఇంతకీ బెల్లంకొండ చేయబోయే బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా?

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడట ఈ హీరో. ప్రస్తుతం ఈ రీమేక్ ప్రాజెక్టును హ్యాండిల్ చేసే డైరక్టర్ కోసం అన్వేషిస్తున్నారు. అన్నీ సెట్టయిన తర్వాత ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తారు.

బెల్లంకొండ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు ఉత్తరాదిన మంచి పాపులారిటీ ఉంది. చాలా సినిమాలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడా పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా స్ట్రయిట్ హిందీ సినిమాను బెల్లంకొండ లాంఛ్ చేయబోతున్నాడని అంటున్నారు.

First Published:  12 Nov 2020 11:38 PM GMT
Next Story