Telugu Global
Cinema & Entertainment

కొలిక్కి వచ్చిన చైతూ సినిమా

దీపావళితో తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు నాగచైతన్య. ఏడాదిగా చేస్తున్న లవ్ స్టోరీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. లవ్ స్టోరీ అనేది టైటిల్ కు తగ్గట్టు ప్రేమకథ అని అంతా అనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు చిన్నపాటి షాక్ ఇచ్చేలా పెళ్లి ఫొటోను రిలీజ్ చేశారు మేకర్స్. నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లికొడుకు-పెళ్లికూతురు గెటప్ లో ఉన్న స్టిల్ ప్రస్తుతం వైరల్ […]

కొలిక్కి వచ్చిన చైతూ సినిమా
X

దీపావళితో తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు నాగచైతన్య. ఏడాదిగా చేస్తున్న లవ్ స్టోరీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు.

లవ్ స్టోరీ అనేది టైటిల్ కు తగ్గట్టు ప్రేమకథ అని అంతా అనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు చిన్నపాటి షాక్ ఇచ్చేలా పెళ్లి ఫొటోను రిలీజ్ చేశారు మేకర్స్. నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లికొడుకు-పెళ్లికూతురు గెటప్ లో ఉన్న స్టిల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అయితే అంతా బాగుంది కానీ అభిమానులకు మాత్రం ఓ చిన్న నిరాశ అలానే ఉండిపోయింది. దీపావళి సందర్భంగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ మేకర్స్ మరోసారి వాయిదా మంత్రం జపించారు. సరైన సమయం చూసి సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయాలని అనుకుంటున్నారట.

First Published:  14 Nov 2020 8:00 AM GMT
Next Story