Telugu Global
Cinema & Entertainment

రానా ఎందుకు వెనకబడ్డాడంటే....

బాహుబలి సినిమా ప్రభాస్ కు ఎంత పేరు తీసుకొచ్చిందో, అదే సమయంలో రానాకు కూడా అంతే పేరు తెచ్చిపెట్టింది. ఇంకా చెప్పాలంటే, తనకున్న బాలీవుడ్ కాంటాక్స్ట్ ద్వారా ప్రభాస్ కంటే ఎక్కువగా రానానే ఎక్కువ పబ్లిసిటీ పొందగలిగాడు. కానీ బాహుబలి-2 తర్వాత పాన్-ఇండియా సినిమాలు చేయడంలో ప్రభాస్ తో పోలిస్తే, రానా బాగా వెనకబడ్డాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమా.. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే. కానీ రానా మాత్రం ఇంత ఫాస్ట్ గా పాన్ […]

రానా ఎందుకు వెనకబడ్డాడంటే....
X

బాహుబలి సినిమా ప్రభాస్ కు ఎంత పేరు తీసుకొచ్చిందో, అదే సమయంలో రానాకు కూడా అంతే పేరు తెచ్చిపెట్టింది. ఇంకా చెప్పాలంటే, తనకున్న బాలీవుడ్ కాంటాక్స్ట్ ద్వారా ప్రభాస్ కంటే ఎక్కువగా రానానే ఎక్కువ పబ్లిసిటీ పొందగలిగాడు. కానీ బాహుబలి-2 తర్వాత పాన్-ఇండియా సినిమాలు చేయడంలో ప్రభాస్ తో పోలిస్తే, రానా బాగా వెనకబడ్డాడు.

రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమా.. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే. కానీ రానా మాత్రం ఇంత ఫాస్ట్ గా పాన్ ఇండియా సినిమాలు సెట్ చేయలేకపోయాడు. దీనికి ఓ రీజన్ ఉందని కూడా చెబుతున్నాడు ఈ హీరో.

“బాహుబలి తర్వాత చేయబోయే కథ ఆ రేంజ్ లో ఎగ్జయిట్ చేసేదిగా ఉండాలి. అందుకే గ్యాప్ తీసుకున్నాను. సరిగ్గా అప్పుడే అరణ్య సినిమా వచ్చింది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. బాహుబలికి ఐదేళ్లు కష్టపడితే ఈ సినిమాకు మూడేళ్లు కష్టపడ్డాను. ఇంకా చెప్పాలంటే బాహుబలి కంటే ఎక్కువ కష్టం అరణ్య సినిమాలో ఉంది. మధ్యలో కరోనా రావడంతో ఇంకో ఏడాది పోయింది.”

ఇలా కెరీర్ లో తను ఎందుకు వెనకబడ్డాడో చెప్పుకొచ్చాడు రానా. అరణ్య సినిమా తన కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ గా నిలిచిపోతుందని అంటున్నాడు.

First Published:  13 Nov 2020 8:30 PM GMT
Next Story